Begin typing your search above and press return to search.

బాబాయి, అబ్బాయి బోల్డ్‌ సిరీస్‌ కంటిన్యూ...!

గత ఏడాది మార్చి లో వెంకటేష్‌, రానా లు 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   7 March 2024 1:30 PM GMT
బాబాయి, అబ్బాయి బోల్డ్‌ సిరీస్‌ కంటిన్యూ...!
X

వెబ్‌ సిరీస్ లకు వెబ్‌ కంటెంట్స్ కి ఆధరణ పెరుగుతున్న ఈ సమయంలో పలువురు స్టార్‌ హీరోలు, స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఓటీటీ దారి పడుతున్న విషయం తెల్సిందే. గత ఏడాది మార్చి లో వెంకటేష్‌, రానా లు 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆ వెబ్‌ సిరీస్ లో బోల్డ్‌ కంటెంట్‌ కాస్త ఎక్కువ అయ్యిందనే విమర్శలు చేస్తూనే ప్రేక్షకులు పెద్ద ఎత్తున చూశారు. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ దాదాపు రెండు నెలల పాటు టాప్‌ వెబ్‌ సిరీస్ గా నిలిచింది. తెలుగు తో పాటు హిందీలో కూడా ఈ వెబ్‌ సిరీస్ కి మంచి స్పందన వచ్చింది.

రానా నాయుడు వెబ్‌ సిరీస్ కి సీజన్ 2 ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ కి సీజన్ 2 ను రూపొందించే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మార్చి 25, 2024న సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే సుపర్ణ్‌ వర్మ మరియు కరణ్‌ అన్షుమాన్‌ లు స్క్రిప్ట్‌ వర్క్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే సీజన్ 2 కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. సీజన్ 1 లోని పాత్రలే సీజన్‌ 2 కి కంటిన్యూ అయ్యే విధంగా స్క్రిప్ట్ రెడీ అయినట్లుగా సమాచారం అందుతోంది. సీజన్ 2 లో బాబాయి, అబ్బాయి ఇద్దరూ ఉంటారా లేదా అనేది చూడాలి.