Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు రికార్డ్..!

నెట్ ఫ్లిక్స్ లో ఎన్నో సీరీస్ లు రిలీజ్ అవగా ఇండియా నుంచి నెట్ ఫ్లిక్స్ 400 లిస్ట్ లో ఒక్క రానా నాయుడు మాత్రమే ప్లేస్ దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 11:50 AM GMT
నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు రికార్డ్..!
X

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది రిలీజ్ చేసిన టాప్ 400 వెబ్ కంటెంట్ లిస్ట్ లో ఇండియా నుంచి రానా నాయుడు చోటు సంపాదించింది. జనవరి నుంచి జూన్ వరకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన టాప్ 400 వెబ్ కంటెంట్ ని ప్రకటించారు. అందులో రానా నాయుడు 336 వ స్థానాన్ని దక్కించుకుంది. రానా నాయుడు సీరీస్ 1 కోటి 64 లక్షల వ్యూయింగ్ అవర్స్ తో ఆ ప్లేస్ సాధించింది. నెట్ ఫ్లిక్స్ లో ఎన్నో సీరీస్ లు రిలీజ్ అవగా ఇండియా నుంచి నెట్ ఫ్లిక్స్ 400 లిస్ట్ లో ఒక్క రానా నాయుడు మాత్రమే ప్లేస్ దక్కించుకుంది.

రానా నాయుడు సీరీస్ లో విక్టరీ వెంకటేష్, రానా నటించారు. రానా నాయుడు వెబ్ సీరీస్ ను నెట్ ఫ్లిక్స్ నిర్మించగా సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమాన్ సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. వెంకటేష్ చేసిన మొదటి వెబ్ సీరీస్ ఇదే కాగా సీరీస్ లో వెంకటేష్ బోల్డ్ డైలాగ్స్ ఆయన ఫ్యాన్స్ ని కాస్త డిజప్పాయింట్ చేశాయి. అయితే నటుడంటే అన్ని పాత్రలు చేయాలి అందుకే రానా నాయుడు సీరీస్ ని వెంకటేష్ ఛాలెంజింగ్ గా తీసుకుని చేశారు. మొదట కాస్త విమర్శలు వచ్చినా రానా నాయుడు సీరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది.

సౌత్ లో వెంకటేష్ కి ఉన్న క్లాస్ ఇమేజ్ వల్ల ఇక్కడ అంతగా చూడలేదు. అయితే తర్వాత కథని అర్థం చేసుకుని సౌత్ ఆడియన్స్ కూడా రానా నాయుడు చూశారు. ఇక నెట్ ఫ్లిక్స్ ప్రకటించిన ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది అమెరికన్ థ్రిల్లర్ ది నైట్ ఏజెంట్ నిలిచింది. 812 మిలియన్ల గంటలతో ఈ సీరీరీస్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

రానా నాయుడు సెకండ్ సీజన్ కూడా సిద్ధం చేస్తున్నారు. తను చేసిన మొదటి సీరీస్ బోల్డ్ గా ఉండటంపై వెంకటేష్ అన్ని జోనర్ లలో సినిమాలు చేయాలి. రానా నాయుడు కేవలం కొంతమంది ప్రేక్షకుల కోసమే చేసిన సీరీస్ అని అన్నారు. నెట్ ఫ్లిక్స్ టాప్ 400 లిస్ట్ లో రానా నాయుడు నిలిచింది కాబట్టి రానా నాయుడు 2 కి ఇది ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.