Begin typing your search above and press return to search.

హ‌ను మాన్ గ్రాఫిక్ న‌వ‌ల‌.. రానా మైండ్‌లో ఏం ఉంది?

తెలుగు ప్ర‌తిభ రూపొందించిన హను-మాన్ పాన్ ఇండియాలో అద్భుతమైన విజయం సాధించడంతో రానాతో చిత్ర బృందం క‌లిసి ఈ చిత్రం ఆధారంగా గ్రాఫిక్ నవలని డెవలప్ చేయాల్సిందిగా విపరీతమైన డిమాండ్ ఉంది

By:  Tupaki Desk   |   22 April 2024 4:56 AM GMT
హ‌ను మాన్ గ్రాఫిక్ న‌వ‌ల‌.. రానా మైండ్‌లో ఏం ఉంది?
X

రానా దగ్గుబాటి ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే కాదు.. అత‌డు ఎంట‌ర్ ప్రెన్యూర్. సినీఔత్సాహికుడు. మంచి సినిమా ఎక్క‌డ ఉన్నా దానికి ప్ర‌చారం క‌ల్పించేందుకు రానా వెన‌కాడ‌డు. ప్ర‌తిభావంతుల‌కు అత‌డి స‌హ‌కారం అంతా ఇంతా కాదు. ప‌రిశ్ర‌మ‌లో ట్యాలెంట్ ని గుర్తించి ప్రోత్స‌హించే గొప్ప నైజం అతడి సొంతం. ఇప్ప‌టికే రానా చాలా సినిమాల‌కు మ‌ద్ధ‌తుగా నిలిచారు. క్రియేటివ్ ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కనిర్మాత‌ల‌కు అండ‌గా నిలిచారు. వారి విజ‌యాల్లో కీల‌క భూమిక పోషించారు.

త‌న స్నేహితుల కోసం రానా చాలా స‌హాయం అందిస్తుంటారు. బాహుబ‌లి కోస్టార్ ప్ర‌భాస్ కి అలాంటి స‌హ‌కారం అంద‌జేస్తున్నాడు. ఇటీవ‌ల కల్కి 2898 AD టీమ్‌ని SDCC 2023(కామిక్ కాన్ ) కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.

ఉత్తర భారతదేశంలో హను-మాన్‌ని ప్రమోట్ చేశాడు. ఈ సినిమా ద‌క్షిణాదితో పాటు, నార్త్ లో ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే గాక‌, విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. అయితే హ‌నుమాన్ సీక్వెల్ రిలీజ్ ముందు గ్రాఫిక్ న‌వ‌ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.

నిన్న రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, టింకిల్ కామిక్స్‌తో పాటు, మలయాళ సూపర్ హీరో మిన్నల్ మురళి గ్రాఫిక్ నవలను ముంబై కామిక్ కాన్‌లో ప్రారంభించారు. 2021లో విడుదలైన 'మిన్నల్ మురళి'లో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు ప్ర‌తిభ రూపొందించిన హను-మాన్ పాన్ ఇండియాలో అద్భుతమైన విజయం సాధించడంతో రానాతో చిత్ర బృందం క‌లిసి ఈ చిత్రం ఆధారంగా గ్రాఫిక్ నవలని డెవలప్ చేయాల్సిందిగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి ప్రాణం పోయ‌గ‌ల‌ రానా స‌మ‌ర్థ‌త‌పై చాలా మంది నమ్మకంగా ఉన్నారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సీక్వెల్ జై హనుమాన్ విడుదలకు కొన్ని నెలల ముందు హను-మాన్ గ్రాఫిక్ నవలని ప్రారంభించడం అనేది వ్యూహాత్మక చర్య. మరి రానా మైండ్‌లో ఏం ఉందో తెలియాల్సి ఉంది.