Begin typing your search above and press return to search.

హీరో గారి భార్య 'హలో' కవర్‌ పిక్ వైరల్‌

సాధారణంగా ప్రముఖ మ్యాగజైన్స్ పై హీరోలు లేదా హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు

By:  Tupaki Desk   |   16 Aug 2023 8:12 AM GMT
హీరో గారి భార్య హలో కవర్‌ పిక్ వైరల్‌
X

సాధారణంగా ప్రముఖ మ్యాగజైన్స్ పై హీరోలు లేదా హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు డైరెక్టర్స్ లేదా ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. అప్పుడప్పుడు క్రీడాకారుల కవర్‌ ఫోటోలు కూడా చూస్తూ ఉంటాం. ఎక్కువగా సినీ స్టార్స్ కనిపించే హలో మెగజైన్ పై ఈసారి హీరోగారి భార్య కనిపించి సందడి చేసింది.


హలో మ్యాగజైన్ కవర్‌ పై తాజాగా టాలీవుడ్‌ హీరో రానా భార్య మిహిక దగ్గుబాటి కనిపించారు. హీరోయిన్‌ లకు ఏమాత్రం తక్కువ కాకుండా అందంగా కనిపించడంతో పాటు అందాల ఆరబోత విషయం లో కూడా హీరోయిన్స్ తో పోటీ పడుతుంది అన్నట్లుగా ఫోటో షూట్‌ ఉంది.


మిహిక ను రానా భార్యగా గుర్తు పట్టని వారు ఈమె ఏ భాష హీరోయిన్‌ అయి ఉంటుందని ఎంక్వౌరీ చేస్తున్నారట. ఆ రేంజ్‌ లో అందంగా ఉన్న మిహిక కవర్ ఫోటో తో హలో మ్యాగజైన్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మిహిక ను ఇంత అందంగా ఎప్పుడు చూడలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేయడం లేదు. ఇటీవలే హిరణ్య కశ్యప ప్రాజెక్ట్‌ ను అధికారికంగా ప్రకటించాడు. ఎప్పుడు ఆ సినిమా ప్రారంభం అవ్వబోతుంది అనే విషయం లో క్లారిటీ లేదు. రానా చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లో గుర్తింపును సొంతం చేసుకున్నాడు.