Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కు విలన్ గా పవర్ఫుల్ హీరో

అయితే తాజాగా మూవీలో ప్రతినాయకుడి పాత్ర గురించి ఇంటరెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్ కి విలన్ గా దగ్గుబాటి రానా చేయనున్నారంట.

By:  Tupaki Desk   |   25 Oct 2023 2:30 AM GMT
మెగాస్టార్ కు విలన్ గా పవర్ఫుల్ హీరో
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తాజాగా సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మ్యూజిక్ సిట్టింగ్స్ తో సినిమా ప్రారంభోత్సవం జరిగింది. సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది.

బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ ని వశిష్ట మల్లిడి అందుకోవడం నిజంగా విశేషం అని చెప్పాలి. ఈ సినిమా క్యాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదు. అయితే తాజాగా మూవీలో ప్రతినాయకుడి పాత్ర గురించి ఇంటరెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్ కి విలన్ గా దగ్గుబాటి రానా చేయనున్నారంట.

స్టొరీని దర్శకుడు వశిష్ట రానాకి నేరేట్ చేయడం క్యారెక్టర్ నచ్చడంతో అతను ఒకే చెప్పడం జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్కని ఖరారు చేయాలని అనుకుంటున్నారు. యూవీ క్రియేషన్స్ తో అనుష్కకి మంచి రిలేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ని మెగాస్టార్ కి జోడీగా తీసుకుంటే బాగుంటుందని చూస్తున్నారు.

సెకండ్ ఆప్షన్ గా నయనతార పేరు కూడా పరిశీలిస్తున్నారు. త్వరలో క్యాస్టింగ్ కి సంబందించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫెస్టివల్ తర్వాత మొదలయ్యే అవకాశం ఉందంట. సినిమాలో మెజారిటీగా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి.

బాహుబలి సిరీస్ తర్వాత రానా ప్రతినాయకుడిగా చేయబోయే సినిమా ఇదే అవుతుందని టాక్. మరి ఇది ఎంత వరకు వాస్తవమో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఒక వేళ రానా మూవీలో చేస్తే మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో సినిమాకి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అవ్వొచ్చు.