Begin typing your search above and press return to search.

అసలు రానా ఏం చేస్తున్నట్లు?

కనీసం ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. తాజాగా నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది

By:  Tupaki Desk   |   12 Dec 2023 10:30 AM GMT
అసలు రానా ఏం చేస్తున్నట్లు?
X

నేనే రాజు నేనే మంత్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తేజనే నేరుగా దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకెక్కిన అహింస సినిమా ప్రీరిలిజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుద్దని టాక్ వచ్చిన మొదలవ్వలేదు.

కనీసం ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. తాజాగా నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఇటీవలే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోశ్ నారాయణ్ ను దర్శకుడు తేజ సంప్రదించారట. రానాతో చేయనున్న సినిమాకు సంతోశ్ నారాయణ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసేందుకు తేజ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి గోపీచంద్ అచంట సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో బయటకు రానున్నాయి. మరోవైపు, ఈ మూవీకి రాక్షసరాజు అనే టైటిల్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇది రెండు భాగాలుగా రాబోతుందని సినీ వర్గాల్లో లో టాక్ వినిపిస్తోంది. కథ పెద్దదని అందుకే రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అసలైతే కొన్ని నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను కూడా రెండు నెలల క్రితమే స్టార్ట్ చేయాలని అనుకున్నారట. కానీ మళ్ళీ స్క్రిప్ట్ విషయంలో కొంత మార్పులు అవసరం అని దర్శకుడు టైమ్ తీసుకున్నట్లు టాక్

అయితే రానా హీరోగా కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గానే బిజీగా ఉంటున్నారు. అది కూడా చాలా సెలక్టివ్‌గా ఉంటున్నారు. చివరగా ఆయన విరాటపర్వం చిత్రంతో అలరించారు. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా రాలేదు. మధ్యలో హిరణ్యకశ్యప ప్రకటించారు. త్రివిక్రమ్‌ కథ, మాటలు అందిస్తున్నట్టు వెల్లడించారు. కానీ ఆ ప్రాజెక్ట్ విషయంలో కనిపించని యుద్ధమైతే జరిగింది.

గుణశేఖర్‌ ఈ ప్రాజెక్ట్ పై చాలా ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌ ట్రాక్‌లోకి రావడం పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత అంతా సైలెంట్‌ అయ్యారు. ఈ ప్రాజెక్ట్‌ అసలు ఉంటుందా ఉండదా అనే విషయంలో ఇంతవరకు సరైన అప్డేట్ లేదు. మరోవైపు తేజ - రానా ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుందని చెబుతున్నారు. మరికొందరు రానా.. తేజతో సినిమాను పక్కన పెట్టారని.. పవన్ సాధినేనితో సినిమా తీయనున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.