Begin typing your search above and press return to search.

రానా లైన‌ప్ ఇది..క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేసాడు!

అమెరికాలో జ‌రుగుతోన్న కామిక్ కాన్

By:  Tupaki Desk   |   20 July 2023 7:55 AM GMT
రానా లైన‌ప్ ఇది..క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేసాడు!
X

'విరాట ప‌ర్వం' త‌ర్వాత రానా నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఎప్పుడ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు ఎప్ప‌టిక‌ప్పుడు అడుగుతున్నా? ఆయ‌న ఎలాంటి స‌మాధానం చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న కావాల‌ని సినిమాలు చేయ‌లేదా? లేక అవ‌కాశాలు రాక చేయ‌లేదా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. అయితే తాజాగా వాట‌న్నింటికి రానా శాండియాగో సాక్షిగా తెర దించేసారు.

అమెరికాలో జ‌రుగుతోన్న కామిక్ కాన్ లో పాల్గొనేందుకు వెళ్లిన అక్క‌డ నుంచి త‌న భ‌విష్య‌త్ ప్రాజెక్ట్ వివ‌రాలు ప్ర‌క‌టించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో 'హిర‌ణ్య‌క‌శిప' సినిమా చేసేందుకు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సినిమాని కామిక్ కాన్ వేదిక‌పై ప్ర‌క‌టించారు. త‌న సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా ప‌తాకంపై రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

అమ‌ర చిత్ర క‌థ‌లు ఆధారంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాకి ర‌చ‌న రూపొందిస్తున్నారు. అలాగే 'లార్డ్ ఆఫ్ ది డెక్క‌న్' పేరుతో సొనీలివ్ తో క‌లిసి ఈసిరీస్ ని నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చాళుక్యుల రాజవంశం నేప‌థ్యంలో ఈ సిరీస్ తెర‌కెక్క‌నుంది.

అలాగే వీకెండ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సంస్థ‌తో క‌లిసి మిన్న‌ల్ ముర‌ళి హాస్య పాత్ర‌తో కూడిన ఓ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించారు. ఈ సినిమాల‌న్నింటిని పాన్ వ‌ర‌ల్డ్ లో ఫేమ‌స అయ్యేలా కామిక్ కాన్ లో ప్ర‌క‌టించి తెలుగు అభిమానులు ట్విస్ట్ ఇచ్చారు.

మొత్తానికి ఇంత‌కాలం సైలెంట్ గా ఉన్న రానా ఒక్క‌సారిగా భారీ ప్రాజెక్ట్ ల‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే హిర‌ణ్య క‌శిప లో న‌టించ‌డం మిన‌హా మిగ‌తావ‌న్ని త‌న భాగ‌స్వామ్యంలో వ‌స్తోన్న చిత్రాలుగా ప్ర‌క‌టించారు.

మ‌రి వాటిలో రానా న‌టుడిగా భాగ‌మ‌వుతారా? లేక నిర్మాత‌గానే కొన‌సాగుతారా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. కామిక్ కాన్ లో హిర‌ణ్య క‌శిల లుక్ ని కూడా రిలీజ్ చేసారు. హిర‌ణ్య క‌శిప లుక్ లో రానా ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్నాడు. లుక్ చాలా క్రియేటివ్ గా ఉంది.