Begin typing your search above and press return to search.

కల్కి : రానాకి అసూయగా ఉందట

తాజాగా హీరో రానా చేసిన వ్యాఖ్యలు 'కల్కి' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని పెంచేలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 Feb 2024 1:20 PM GMT
కల్కి : రానాకి అసూయగా ఉందట
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898ఏడీ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కొత్త ప్రపంచాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరిస్తున్నాడు అంటూ గత కొంత కాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.

తాజాగా హీరో రానా చేసిన వ్యాఖ్యలు 'కల్కి' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని పెంచేలా ఉన్నాయి. రానా మాట్లాడుతూ... నేను ఇటీవల కల్కి సినిమా సెట్స్ కి వెళ్లాను. నేను ఏదైతే ఊహించుకున్నానో, నేను ఏదైతో కలలు కంటున్నానో అలాగే కల్కి సినిమాను దర్శకుడు ప్రశాంత్‌ నీల్ రూపొందిస్తున్నట్లుగా అనిపించింది.

ఆ సమయంలో నా నోటి నుంచి మాట రాలేదు. అయితే అక్కడి నుంచి వెళ్లిన తర్వాత పోన్ ద్వారా నాగ్‌ అశ్విన్ తో మాట్లాడాను. కల్కి సెట్స్ లోకి వచ్చి చూస్తే అసూయగా ఉందని అన్నాను. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌ పై రానా చాలా నమ్మకంగా ఉన్నాడని ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది.

కల్కి సినిమాలో రానా గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు అనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై యూనిట్‌ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా సెట్స్ కి వెళ్లాను అంటూ రానా చెప్పడంతో మరోసారి కల్కి లో రానా ఉన్నాడా అనే చర్చ మొదలైంది.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్ తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తున్న ఈ సినిమాలో టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రికార్డ్‌ స్థాయి బడ్జెట్‌ తో ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. పాన్‌ వరల్డ్‌ మూవీ అంటూ కల్కి కి ప్రచారం చేస్తున్నారు. మే 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.