Begin typing your search above and press return to search.

మరో రియల్ కథను పట్టిన రానా?

లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహ్మద్ అలీ లైఫ్ లో ఎన్నో ఇంట్రస్టింగ్ సంఘటనలు జరిగాయి.

By:  Tupaki Desk   |   29 Feb 2024 12:46 PM GMT
మరో రియల్ కథను పట్టిన రానా?
X

రానా దగ్గుబాటి నటుడిగా మిగిలిన హీరోలకి భిన్నమైన కథలతో మూవీస్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. కంటెంట్ బేస్డ్ కథలకి పెద్దపీట వేస్తూ ఉంటారు. ఏదో స్టార్ అయిపోవాలనే ఉద్దేశ్యంతో పరుగులు పెట్టకుండా సెలక్టివ్ గా మూవీస్ చేసే నటుడు. విరాటపర్వం తర్వాత రానా నుంచి 1945, స్పై సినిమాలు వచ్చాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ వేటయాన్ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రాక్షస రాజు అనే మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనేది క్లారిటీ లేదు. అలాగే హిరణ్యకశిప మూవీ కూడా లైన్ లో ఉంది. ఇది భారీ బడ్జెట్ మైథలాజికల్ కాన్సెప్ట్ మూవీ కావడంతో హోల్డ్ లో పెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రానా ఫోకస్ బయోపిక్ మీదకి వెళ్లిందని తెలుస్తోంది.

లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహ్మద్ అలీ లైఫ్ లో ఎన్నో ఇంట్రస్టింగ్ సంఘటనలు జరిగాయి. అందుకే అతని బయోపిక్ ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాలని రానా అనుకుంటున్నారంట. టైటిల్ రోల్ ని తానే పోషించాలని రానా భావిస్తోన్నట్లు టాక్. రానా పవర్ఫుల్, పర్సనాలిటీకి కచ్చితంగా మహ్మద్ ఆలీ క్యారెక్టర్ యాప్ట్ అవుతుంది.

అతని జీవిత కథతో హాలీవుడ్ లో సినిమాలు వచ్చాయి. అయితే ఇండియన్ బ్యాక్ డ్రాప్ లో మహ్మద్ అలీ జీవిత కథని ఎడాప్ట్ చేసుకొని మూవీ, లేదంటే వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందని రానా భావించి తన ఆలోచనలు దర్శకులతో పంచుకున్నారంట. త్వరలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.