Begin typing your search above and press return to search.

బాలయ్య షో లో అది చూపించిన రణబీర్‌

ఇక బాలీవుడ్ స్టార్ హీరో రాక్‌ స్టార్ రణబీర్ కపూర్‌ తన టాటూను నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌ స్టాపబుల్‌ ద్వారా రివీల్ చేశాడు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:33 AM GMT
బాలయ్య షో లో అది చూపించిన రణబీర్‌
X

హీరోలు, హీరోయిన్లు టాటూలు వేయించుకోవడం అనేది చాలా కామన్ విషయం. అయితే వారి అభిమానులు ప్రేక్షకులు వారి యొక్క టాటూల గురించి, ఆ టాటూల వెనుక అర్థం గురించి తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొందరు డైరెక్ట్‌ గా పేర్లను టాటూలుగా వేయించుకుంటూ ఉంటే, కొందరు మాత్రం సింబల్ ను, రహస్య గుర్తులను వేయించుకుంటూ ఉంటారు.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో రాక్‌ స్టార్ రణబీర్ కపూర్‌ తన టాటూను నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌ స్టాపబుల్‌ ద్వారా రివీల్ చేశాడు. ఇప్పటి వరకు రణబీర్ కపూర్‌ చూపించని ఆ టాటూను బాలయ్య షో లో ప్రేక్షకులు మరియు ఆయన అభిమానులు చూస్తున్నారు. జాతీయ మీడియాలో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది అనడంలో సందేహం లేదు.

గత ఏడాది రణబీర్ కపూర్‌, ఆలియా దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. తమ కూతురు కు రహా అనే పేరును పెట్టిన విషయం తెల్సిందే. రహా పుట్టి ఏడాది దాటినా కూడా ఇప్పటి వరకు ఆమె ఫేస్ ను ఈ బాలీవుడ్ జోడీ రివీల్‌ చేయలేదు. ఆ పాప కు సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా అసలు రణబీర్ కపూర్ బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు.

అలాంటిది తన కూతురు పేరును తన మెడ పై టాటూ గా వేయించుకున్నాను అంటూ రణబీర్ కపూర్‌ చెప్పుకొచ్చాడు. యానిమల్‌ సినిమా ప్రమోషన్ కోసం బాలయ్య అన్ స్టాపబుల్‌ షో కి హీరోయిన్ రష్మిక మందన్న మరియు సందీప్ వంగతో కలిసి రణబీర్ కపూర్‌ హాజరు అయ్యి సందడి చేసిన విషయం తెల్సిందే.

యానిమల్‌ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేయడం లో యూనిట్‌ సభ్యులు సక్సెస్ అయ్యాయి. హిందీలో రూపొందిన ఈ సినిమా ను సౌత్‌ లోని అన్ని భాషల్లో రివీల్‌ చేయబోతున్నారు. తెలుగు లో ఈ సినిమా కి మంచి బిజినెస్ జరిగింది.

దర్శకుడు తెలుగు వ్యక్తి అవ్వడం తో పాటు హీరోయిన్‌ రష్మిక అవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకులు యానిమల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. వచ్చే వారం లో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. రణబీర్ కపూర్ కి ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. మరి ఈ సినిమాతో అయినా ఆయనకు హిట్‌ పడేనా చూడాలి.