Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అంబానీ ప్రీ వెడ్డింగ్ పార్టీలో స్టార్‌ కపుల్‌

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ ల ప్రీ వెడ్డింగ్‌ పార్టీ ఇటలీలో వైభవంగా జరిగిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2024 11:39 AM GMT
పిక్ టాక్‌ : అంబానీ ప్రీ వెడ్డింగ్ పార్టీలో స్టార్‌ కపుల్‌
X

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ ల ప్రీ వెడ్డింగ్‌ పార్టీ ఇటలీలో వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఇండియాకు చెందిన అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఈ పార్టీకి ఆహ్వానం అందింది అంటూ బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరిగింది.


అంబానీ వారి ప్రీ వెడ్డింగ్‌ పార్టీ లో బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణబీర్ కపూర్‌ - ఆలియా భట్ లు పాల్గొన్నారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సెలబ్రిటీలు షేర్‌ చేస్తున్నారు. తాజాగా ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్‌ లతో పాటు ఈ ఫోటోలో కరిష్మా కపూర్ ను కూడా ఈ ఫోటోలో చూడొచ్చు.


యానిమల్‌ సినిమాలో ఫుల్‌ గడ్డం మరియు జుట్టు తో టైటిల్‌ కు తగ్గట్లుగా మాస్ గా ఇన్నాళ్లు కనిపించాడు. చాలా గ్యాప్‌ తర్వాత రణబీర్ కపూర్ ఇలా స్టైలిష్ గా కనిపించాడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రాబోయే సినిమాలో రణబీర్ ఇలాగే కనిపించబోతున్నాడా అనే చర్చ జరుగుతోంది.

రామాయణం సినిమా లో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. రాముడి గా ఈయన నటించబోతున్న నేపథ్యంలో సాయి పల్లవిని సీత పాత్రలో నటింపజేసేందుకు ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. ఆ మధ్య టెస్ట్‌ షూటింగ్‌ కూడా చేశారని వార్తలు వచ్చాయి.

మరో వైపు ఆలియా భట్ కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ లో నెం.1 హీరోయిన్‌ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.