Begin typing your search above and press return to search.

`ర‌ణబీర్‌- అలియా` నికర ఆస్తుల విలువ‌?

ర‌ణ‌బీర్ - ఆలియా జంట కెరీర్ 2023లో అత్యుత్త‌మంగా ఉంది. RK 2023లో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో బాక్సాఫీస్ కింగ్ గా నిలిచాడు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 4:37 AM GMT
`ర‌ణబీర్‌- అలియా` నికర ఆస్తుల విలువ‌?
X

రణబీర్ కపూర్- అలియా భట్ జంట 2023లో కెరీర్ అత్యుత్త‌మ ద‌శ‌ను ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభావంతులుగానే కాదు.. రిచెస్ట్ దంప‌తులుగాను ఈ జంట ఇప్పుడు రికార్డుల‌కెక్కారు. ఇటీవ‌ల విస్త్ర‌తంగా చర్చనీయాంశమైన భార్యాభర్తలుగా వార్త‌ల్లో ఉన్నారు. ఈ జంట‌ నికర ఆస్తుల‌ విలువ 885కోట్లు. ఈ కంబైన్డ్ నికర ఆస‌తుల‌ విలువ 79.2 శాతానికి పెరిగింది. ఆలియా మొత్తం ఆస్తులలో 58.67 శాతం వృద్ధిని న‌మోదు చేయ‌గా, RK కంటే దాదాపు 1.5 రెట్లు ఎక్కువ ఆస్తుల‌ను ఆలియా క‌లిగి ఉంది. 885 కోట్ల‌లో ర‌ణ‌బీర్ ఆస్తుల విలువ ఎంత‌? ఆలియా ఆస్తుల విలువ ఎంత‌? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ర‌ణ‌బీర్ - ఆలియా జంట కెరీర్ 2023లో అత్యుత్త‌మంగా ఉంది. RK 2023లో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో బాక్సాఫీస్ కింగ్ గా నిలిచాడు. ఇటీవ‌ల విడుద‌లైన యానిమ‌ల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్ల‌బ్ వైపు ప‌రుగులు పెడుతోంద‌ని ట్రేడ్ చెబుతోంది. అత‌డి కెరీర్ బెస్ట్ సినిమాగా యానిమ‌ల్ రికార్డుల‌కెక్క‌నుంది. ఆలియా భట్ ఈ సంవత్సరం రెండు భారీ విడుదలలతో అద్భుతమైన ఫేజ్‌ని ఆస్వాధిస్తోంద‌. ఆలియా హాలీవుడ్ తొలి హార్ట్ ఆఫ్ స్టోన్ .. కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ.. ఈ ఏడాది గొప్ప అనుభూతినిచ్చాయి. కొన్నేళ్లుగా ఆలియా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజ‌యాల‌ను అందుకుంటోంది.

ఈ ప‌వ‌ర్ క‌పుల్ కు ఖరీదైన ఆస్తులు, కార్లు, నగలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ జంటకు లండన్‌లో అద్భుతమైన, విలాసవంతమైన విల్లా ఉంది. అలియాకు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. GQ ప్రకారం 2 కోట్ల విలువైన ఇంటీరియర్స్‌తో స‌న్‌షైన్ లో వర్క్‌ప్లేస్ అందుబాటులో ఉంది.

రణబీర్ కపూర్ నికర ఆస్తులు- 365 కోట్లు

రణబీర్ కపూర్ ఆస్తులలో 35 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. ఇది వాస్తు అనే భవనంలోని ఏడవ అంతస్తులో ఉంది. అతడు `సావ్న్‌`లో పెట్టుబడిదారుడిగా ఉన్నప్పుడు ముంబై సిటీ FC అనే ఫుట్‌బాల్ జట్టుకు సహ-యజమానిగా ఉన్నాడు. అతడికి ముంబైలో 16 కోట్ల విలువైన మరో అపార్ట్‌మెంట్ ఉంది. రోల్స్ రాయిస్, మెర్సిడెస్-బెంజ్ GL క్లాస్, రేంజ్ రోవర్, లెక్సస్, BMW X6, ఆడిRS7 మరియు టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ 2.5 కోట్ల విలువైన కార్లు, 2.3 కోట్ల విలువైన ఆడి R8 వంటి కార్లు అత‌డికి ఉన్నాయి.

అలియా భట్ నికర ఆస్తులు - 520 కోట్ల

అలియాకు బాంద్రాలో 12-15 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ ఉంది. రణబీర్‌ను పెళ్లి చేసుకునే ముందు, ఆమె `వాస్తు`లోని 5వ అంతస్తులో 32 కోట్లతో అపార్ట్‌మెంట్ ను కొనుగోలు చేసింది! ప్రొడక్షన్ హౌస్ కాకుండా ఎడ్-మామా అనే కంపెనీని నిర్వ‌హిస్తోంది. ఫిన్‌కాష్ నివేదిక ప్రకారం...ఆలియా వివిధ ర‌కాల వ్యాపారాల్లో 40 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్ట‌గా, 60 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. ఆలియా మొత్తం నికర ఆస్తుల‌ విలువ దాదాపు 520 కోట్లుగా అంచనా.

ఆస్తుల విలువ‌ 79.2 శాతం జంప్

ఈ జంట ఆస్తుల‌ మొదటి అంచనా నికర విలువ దాదాపు 495 కోట్లు. ఇప్పుడు 885 కోట్ల విలువైన ఆస్తితో 79.2 శాతం ఎదుగుద‌ల‌ను సాధించారు. ఆలియా ఈ సంయుక్త నికర విలువలో దాదాపు 60శాతం వాటాను కలిగి ఉంది. ఆలియా ఆస్తుల‌ విలువ RK కంటే దాదాపు 1.5 రెట్లు ఎక్కువ! అలియా భట్ RRR-గంగూబాయి కతియావాడి-గల్లీ బాయ్-రాజీ- బ్రహ్మాస్త్ర - మొదటి భాగం: శివ వంటి ప్రముఖ టైటిల్‌లతో సహా 20 అధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ ఏడు సినిమాలు రూ. 100 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించాయి.

అలియా భట్ రెండవ అత్యధిక పారితోషికం పొందిన బాలీవుడ్ నటిగా పాపుల‌రైంది. ఒక్కో సినిమాకు ఫీజు రూ. 20 కోట్లు.. ఎండార్స్‌మెంట్ ఫీజు 1-2 కోట్ల వరకు అందుకుంటోంది. మ‌రోవైపు ర‌ణ‌బీర్ క‌పూర్ ఒక్కో సినిమాకు 40కోట్ల రేంజులో పారితోషికాలు అందుకుంటున్నారు.