Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ర‌ణ‌బీర్-ఆలియా త‌న్మ‌యానందం

ర‌ణ‌బీర్ న‌టించిన యానిమ‌ల్ ఈ శుక్ర‌వారం అత్యంత భారీగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రీబుకింగుల్లో ఈ సినిమా స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాస్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 3:27 AM GMT
ఫోటో స్టోరి: ర‌ణ‌బీర్-ఆలియా త‌న్మ‌యానందం
X

ర‌ణ‌బీర్ న‌టించిన యానిమ‌ల్ ఈ శుక్ర‌వారం అత్యంత భారీగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రీబుకింగుల్లో ఈ సినిమా స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాస్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది. ఇదిలా ఉంటే యానిమ‌ల్ కి ప్ర‌మోష‌న్ చేయడంలో ర‌ణ‌బీర్ భార్య ఆలియా భ‌ట్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇంత‌కుముందే ఆలియా ప్రీమియ‌ర్ షో కోసం స్పెష‌ల్లీ డిజైన్డ్ టీష‌ర్ట్ ని ధ‌రించింది. అలియా భట్ తన సోదరి షాహీన్ భట్ ..అత్తగారు నీతూ కపూర్‌తో కలిసి ప్రత్యేక షోకోసం వెళ్లడం కనిపించింది. అంతేకాదు యానిమల్‌లోని రణబీర్ పాత్ర ఫోటోతో కస్టమైజ్డ్ టీని ధరించి ప్ర‌చారంలో కొత్త ఎత్తుగ‌డ‌ను అనుస‌రించింది.


ఇప్పుడు ర‌ణ‌బీర్ త‌న స‌తీమ‌ణి ఆలియాతో క‌లిసి జంట‌గా ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి దానికి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించాడు. ఆలియా-ర‌ణ‌బీర్ జంట ఈ ఫోటోగ్రాఫ్ లో మైమ‌రిచి న‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. ర‌ణ‌బీర్ త‌న స‌తీమ‌ణి నుదిటికి త‌న నుదిటిని ఆన్చి ఎంతో ఆనందంగా క‌నిపించాడు. బ‌హుశా యానిమ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ వైబ్స్ ఇలా భార్యాభ‌ర్త‌ల ముఖాల్లో ఎలివేట్ అవుతున్నాయ‌ని భావించాలి.


తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ కి ర‌ణ‌బీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించాడు. #యానిమ‌ల్ సినిమాలో లాగా తమ పెళ్లికి పర్వత సెట్టింగ్‌ని ఎంచుకుంటే తన భార్య ఆలియాభ‌ట్ ఆకర్షితురాలై ఉండేదని ర‌ణ‌బీర్ క‌పూర్ వ్యాఖ్యానించారు. ర‌ణ‌బీర్-ఆలియా మైమ‌రిచి ఆద‌మ‌రిచి ఇలా క‌నిపించ‌డంతో అభిమానులు ఈ ఫోటోగ్రాఫ్ పై ప్రేమ‌ను కురిపించారు.

యానిమల్‌కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. తండ్రి - కొడుకుల న‌డుమ అంతులేని ప్రేమ‌, విషపూరిత సంబంధం చుట్టూ తిరిగే క‌థాంశ‌మిది. కొడుక్కి అందుబాటులో లేని తండ్రిగా అనిల్ క‌పూర్ నటించ‌గా, బాధ కోపంతో ఉన్న కొడుకు పాత్రలో రణబీర్ నటించాడు. యానిమల్ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగాకు రెండో సినిమా. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలవుతోంది.

100 కోట్ల ఓపెనింగులు?

రూ. 100 కోట్ల గ్లోబల్ ఓపెనింగ్‌తో రణబీర్ కపూర్ `యానిమ‌ల్` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించ‌బోతోంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. విక్కీ కౌశల్ క‌థానాయ‌కుడిగా మేఘనా గుల్జార్ తెర‌కెక్కించిన‌ సామ్ బహదూర్ చిత్రం ఇదే రోజు విడుద‌ల‌వుతోంది. కానీ ఓపెనింగుల్లో నెమ్మదిగా ప్రారంభం అవుతోంది. అందుకు భిన్నంగా యానిమల్ ప్రారంభ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు బలంగా కనిపిస్తున్నాయని ట్రేడ్ చెబుతోంది. యానిమల్ టీజర్ విడుదలైనప్పటి నుండి మీడియా హెడ్ లైన్స్ లో ఆధిపత్యం చెలాయించింది. ట్రైల‌ర్ తో క్రేజ్ ప‌రాకాష్ఠ‌కు చేరుకుంది. అడ్వాన్స్ బుకింగ్ లు ప్రీబుకింగుల్లో రికార్డులు న‌మోదవుతున్నాయ‌ని తెలిసింది. నిజానికి రణబీర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అస్థిరమైన ట్రాక్‌ను కలిగి ఉన్నాయి. ప్రీ-పాండమిక్‌కు ముందు విడుదల చేసిన `సంజు` బిగ్ హిట్ అయిన‌ తర్వాత విడుదలైన తూ ఝూతి మైన్ మక్కార్, బ్రహ్మాస్త్ర, షంషేరా చిత్రాలు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను అందుకున్నాయి. షంషేరా పూర్తిగా ఫెయిలైంది. బ్రహ్మాస్త్ర కొంత మేర‌ ప్రజలను ఆకర్షించింది. అయితే రూ. 400 కోట్ల బడ్జెట్ తో రూపొంద‌డం వ‌ల్ల కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. తూ ఝూతి మైన్ మక్కార్ మంచి ఆదాయాలతో కొంత ఉపశమనం కలిగించింది. అయితే సందీప్ రెడ్డి వంగా తో యానిమల్‌ బాక్సాఫీస్ వ‌ద్ద అస్థిర‌త‌ను బీట్ చేస్తుంద‌ని భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల ఓపెనింగులు సాధించ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.