Begin typing your search above and press return to search.

వీడియో : భార్యతో 'గ్లాస్' స్టెప్‌ వేసిన హీరో

సినిమాలోని జమాల్ కుత్తు పాట ఎంతటి వైరల్‌ అయ్యిందో కూడా అందరికి తెల్సిందే.

By:  Tupaki Desk   |   29 Jan 2024 10:49 AM GMT
వీడియో : భార్యతో గ్లాస్ స్టెప్‌ వేసిన హీరో
X

బాలీవుడ్‌ స్టార్‌ రణబీర్ కపూర్‌, తెలుగు యంగ్‌ డైరెక్టర్ సందీప్ వంగ కలిసి చేసిన 'యానిమల్‌' సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో పాటు రణబీర్ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. సౌత్‌, నార్త్‌, ఓవర్సీస్‌.. ఇలా అన్ని చోట్ల కూడా యానిమల్ కుమ్మేసింది.

సినిమాలోని జమాల్ కుత్తు పాట ఎంతటి వైరల్‌ అయ్యిందో కూడా అందరికి తెల్సిందే. స్టార్స్ నుంచి చిన్న సెలబ్రిటీల వరకు జమాల్ కుత్తు పాటకు రీల్స్ చేసి, డాన్స్ చేసి సందడి చేశారు. ఏ స్టేజ్ పై అయినా కూడా జమాల్‌ కుత్తు పాట వినిపిస్తూనే ఉంది. తాజాగా మరోసారి జమాల్ కుత్తు వీడియో వైరల్‌ అవుతోంది.

ఈసారి ఒక కార్యక్రమంలో రణబీర్ కపూర్ ఆయన భార్య ఆలియా భట్ తో కలిసి చేసిన డాన్స్ వైరల్‌ అవుతోంది. రణబీర్ మరియు ఆలియా లు తలపై గాజు గ్లాస్ లు పెట్టుకుని మరీ జమాల్ కుత్తు పాటకు డాన్స్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కొన్ని సెకన్ల వీడియో అయినా కూడా రణబీర్, ఆలియాల జమాల్ కుత్తు గ్లాస్ డాన్స్ వైరల్‌ అవుతోంది. మరికొంత సమయం ఆలియా ఈ పాటకు డాన్స్ చేసి ఉంటే బాగుండేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ దంపతుల జమాల్ కుత్తు సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది.