Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' కాప్ యానివ‌ర్శ‌లోకి అనుకుంటే?

'సింగం ఎగైన్' అంటూ కాప్ స్టోరీ నుంచి మ‌ళ్లీ రొహిత్ శెట్టి అండ్ కో దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన భాగాల‌న్నీ భారీ విజ‌యం సాధించ‌డంతో 'సింగం ఎగైన్' పై భారీ అంచ నాలున్నాయి.

By:  Tupaki Desk   |   4 Jan 2024 8:23 AM GMT
యానిమ‌ల్ కాప్ యానివ‌ర్శ‌లోకి అనుకుంటే?
X

'సింగం ఎగైన్' అంటూ కాప్ స్టోరీ నుంచి మ‌ళ్లీ రొహిత్ శెట్టి అండ్ కో దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అయిన భాగాల‌న్నీ భారీ విజ‌యం సాధించ‌డంతో 'సింగం ఎగైన్' పై భారీ అంచ నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టు భారీ కాన్వాస్ పై చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌.. అక్ష‌య్ కుమార్..దీపికా ప‌దుకొణే..టైగ‌ర్ ష్రాప్..ర‌ణ‌వీర్ సింగ్ ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ల తో హీట్ పెంచేసారు.

ఒక్కో లుక్ మాస్ ఆడియ‌న్స్ లో కాక పుట్టించింది. కాప్ సిరీస్ లో ఒక్కొక్క‌రు పోలీస్ గెట‌ప్స్ లో క‌నిపిస్తోన్న వైనం చూస్తుంటే? రోహిత్ శెట్టి సినిమాని ఏ రేంజ్ లో చెక్కుతున్నాడో అద్దం ప‌డుతుంది. మ‌రి ఈ కాప్ స్టోరీలో రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా చేరుతున్నాడా? అత‌డితోనూ ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ గెట‌ప్ వేయిం చాడా? అంటే అనుకోవ‌డం స‌హ‌జం. ఎందుకంటే ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్ పోలీస్ గెట‌ప్ లో ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఖాకీ డ్రెస్ లో ప‌వ‌ర్పుల్ గా క‌నిపిస్తున్నాడు. మొలితిరిగిన కండ‌లపై ఖాకీ డ్రెస్ తో సింగం దూకుడు ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. దీంతో ర‌ణ‌వీర్ సింగ్ పాత్ర కూడా సినిమాలో చాలా బ‌లంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఖాకీ డ్రెస్ లో దీపికా ప‌దుకొణేని హైలైట్ చేసారు. గెడ్డం..కోర మీసాలు..క‌ళ్ల‌కు గ్లాసెస్ ధ‌రించి అలా న‌డుచుకుంటూ వ‌స్తోన్న ర‌ణ‌బీర్ ని చూస్తుంటే! మ‌రో ప‌వ‌ర్ పుల్ పోలీస్ వ‌చ్చేస్తున్నాడు అనిపిస్తుంది.

రోహిత్ శెట్టితో 'యానిమ‌ల్' చీర్స్ కొట్టిన వైనం చూస్తుంటే? ర‌ణ‌బీర్ పాత్ర‌ని సైతం సినిమాలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసాడు అనుకోవ‌డం అంతే స‌హ‌జం. కానీ ఇదంతా సింగం ఎగైన్ కోసం అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుంటే ఇవి సినిమా స్టిల్స్ కాదు. ఆన్ సెట్స్ నుంచి లీకైన యాడ్ షూట్ కి సంబంధిం చిన‌వి. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ‌బీర్ క‌పూర్ ఓ యాడ్ లో న‌టిస్తున్నాడు. ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేయ డంతో ఈ ఫోటోలు స్పాట్ నుంచి లీక్ అయ్యాయి. అయితే ఆయాడ్ దేనిక‌న్న‌ది తెలియ‌దు. ఆ వివ‌రాలు తెలియాల్సి ఉంది.