రానా నాయుడు : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
ఈ ఏడాది ఆరంభంలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 15 Jun 2025 12:03 PM ISTఈ ఏడాది ఆరంభంలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. కేవలం తెలుగు భాషలో విడుదల అయ్యి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచిన విషయం తెల్సిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా తర్వాత వెంటనే వెంకటేష్ కొత్త సినిమాను కమిట్ అవుతాను అంటూ ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన కొత్త సినిమా ఆలస్యం అవుతుంది. సినిమాతో రాని వెంకటేష్ వెబ్ సిరీస్‌తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రానాతో కలిసి వెంకటేష్ నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 తాజాగా స్ట్రీమింగ్ అయింది.
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న రానా నాయుడు సీజన్ 2 కి మిశ్రమ స్పందన వచ్చింది. వెబ్ సిరీస్ ప్రేక్షకులు కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ప్రముఖంగా హీరో వెంకటేష్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రానా నాయుడుతో వచ్చిన వెంకటేష్ ఆకట్టుకుంటాడని అంతా నమ్మకంగా ఉన్నారు. కానీ వెబ్ సిరీస్ తీవ్రంగా నిరాశ పరిచింది. రానా నాయుడు వెబ్ సిరీస్ మొదటి సీజన్ సమయంలో వెంకటేష్ అభిమానులు బాబోయ్ ఏంటి ఈ బూతులు, ఏంటి ఈ బూతు సీన్స్ అంటూ మధ్యలోనే సిరీస్‌ను వదిలేసి ఉంటారు. ఇప్పుడు అదే పరిస్థితి.
రానా నాయుడు వెబ్ సిరీస్ మొదటి సీజన్‌లో బూతులు ఉన్నాయి అంటూ తీవ్ర విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ నుంచి అలాంటి కంటెంట్‌ను ఏ ఒక్కరూ సహించడం లేదని తేలింది. అందుకే సీజన్ 2 విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. వెంకటేష్ పాత్ర బూతులు మాట్లాడటం మాత్రమే కాకుండా మొత్తం సిరీస్‌లో బూతులు తగ్గించారు. తక్కువ బూతు కంటెంట్ ను ఉంచడం ద్వారా కాస్త నీట్‌గానే సిరీస్ ఉంది. అయితే సిరీస్‌లో వెంకటేష్ ఉన్న సన్నివేశాలు చాలా తక్కువ ఉన్నాయి. అసలు ఉన్నాడా లేడా అన్నట్లుగానే వెంకటేష్ ఉన్నాడు అనే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వెంకటేష్‌తో బూతులు మాట్లాడించడం తగ్గించాలని, బూతు సీన్స్ కట్ చేయాలి అంటే మేకర్స్ ఏకంగా వెంకటేష్ పాత్రను కట్ చేశారు. సిరీస్ మొత్తంలో కూడా రానా ఎక్కువగా కనిపిస్తున్నాడు. వెంకటేష్ పాత్రను కుదించడంతో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ కోసం చూడాలి అనుకున్న వారికి సీజన్ 1 బూతులు ఇబ్బంది పెట్టాయి, ఇప్పుడు ఆయన పాత్ర తక్కువగా ఉండటంతో చూడ్డం అవసరమా అంటున్నారు. మొత్తానికి రానా నాయుడు అప్పుడు బూతులతో చిరాకు పెట్టింది, ఇప్పుడు వెంకటేష్ పాత్ర లేకపోవడం వల్ల నిరుత్సాహం కలిగించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
