'రానా నాయుడు' ని జనాలు నమ్మడం లేదా..!
రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే నెలలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్‌కి పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు.
By: Tupaki Desk | 23 May 2025 3:00 AM ISTవెంకటేష్, రానా కలిసి నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి స్పందన దక్కించుకుంది. హిందీ ఇతర భాషల్లో వచ్చిన స్పందన తెలుగు ప్రేక్షకుల నుంచి రాలేదు. అందుకు కారణం వెంకటేష్‌ను తెలుగు ప్రేక్షకులు అలాంటి పాత్రలో చూడలేక పోయారు, వెంకీ నుంచి అలాంటి బూతులు వినలేక పోయారు. రానాను కూడా తెలుగు ప్రేక్షకులు మరోలా చూడాలని అనుకుంటున్నారు. అందుకే రానా నాయుడు వెబ్ సిరీస్ తెలుగులో ఫ్లాప్ అయింది. అత్యధిక వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అయిన వెబ్ సిరీస్‌గా నిలవడంతో రానా నాయుడుకు సీక్వెల్ తీసుకు రావాలని నిర్ణయించారు. ఇప్పటికే సీక్వెల్ పనులు పూర్తి అయ్యి స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది.
రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే నెలలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్‌కి పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. టీజర్ విడుదల తర్వాత కూడా జనాలు ఈ వెబ్ సిరీస్ గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఆ మధ్య రానా మాట్లాడుతూ రానా నాయుడు వెబ్ సిరీస్‌ను ప్రపంచం మొత్తం చూసింది కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం చూడలేదు. మమ్ములను అలా చూడలేక తెలుగు ప్రేక్షకులు రానా నాయుడు ను పక్కన పెట్టారు. అందుకే రానా నాయుడు సీజన్ 2 ను అడల్ట్ కంటెంట్‌కు, బూతు కంటెంట్‌కి దూరంగా ఉండేలా ప్లాన్ చేశామని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ సమయంలో వెంకటేష్ రానా నాయుడు గురించి స్పందించారు.
ఆయన మాట్లాడుతూ రానా నాయుడు వెబ్ సిరీస్‌లో బూతులు ఎక్కువ అయిన మాట వాస్తవం. అందుకే తెలుగు ప్రేక్షకులు చూడలేదు. రెండో సీజన్‌లో అలాంటి అడల్ట్ కంటెంట్ ఉండకుండా చూస్తామని చెప్పాడు. వెంకటేష్ మార్క్ సినిమాలను ఇష్టపడే వారు రానా నాయుడు వంటి వెబ్ సిరీస్‌లను అస్సలు ఒప్పుకోరు. అందుకే తెలుగులో సీజన్ 2 కి కూడా పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. మొదటి సీజన్ గురించి తెలిసిన ఏ ఒక్కడు కూడా సీజన్ 2 గురించి ఎదురు చూసే పరిస్థితి ఉండదు. రానా, వెంకటేష్‌లు ఇద్దరూ ఈసార బూతులు ఉండవురా బాబోయ్ అంటూ మొత్తుకున్నా కూడా పెద్దగా పట్టనట్లుగానే ప్రేక్షకులు ఉన్నారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ అయ్యే వరకు కంటెంట్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కనుక ప్రేక్షకులు పెద్దగా ఎదురు చూస్తున్న దాఖలాలు లేవు. తెలుగు హీరోలు కావడంతో ఉత్తరాదిన కూడా ఈ వెబ్ సిరీస్ గురించి పెద్దగా ఎదురు చూపులు లేవు. ఒక వేళ స్ట్రీమింగ్ అయిన తర్వాత కంటెంట్ బాగుంటే మొదటి సీజన్ మాదిరిగా రెండో సీజన్ కూడా అక్కడ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈసారి బూతులు తక్కువ ఉండి, కంటెంట్ కాస్త డీసెంట్‌గా ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆధరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే రానా నాయుడు డీసెంట్‌గా వస్తాడని ఏ ఒక్కరూ నమ్మకం పెట్టుకుని లేరు. అందుకే క్రేజ్ పెద్దగా క్రియేట్ కాలేదు.
