వైల్డ్ ఎక్స్‌పీరియెన్స్ కు రెడీ అవ్వమంటున్న రానా
ఇందులో సునీల్ కనిపించగానే ఎవరూ ఊహించని సిట్యుయేషన్స్ చూస్తామనే ఫీలింగ్ కలుగుతుందని రానా ఈ సందర్భంగా వెల్లడించాడు.
By: Tupaki Desk | 27 May 2025 5:26 PM ISTకెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు దగ్గుబాటి రానా. హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసిన రానా ఆ తర్వాత ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ పాత్రల్లో కూడా మెరిసి అందరినీ ఆకట్టుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తాను చాటిన రానా నెట్‌ఫ్లిక్స్ కోసం రానా నాయుడు వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే.
అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఆ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా రానా నాయుడు2ను నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించింది. ఇప్పటికే సెకండ్ సీజన్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న రానా నాయుడు2 నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రానాతో పాటూ సునీల్ గ్రోవర్ కూడా కనిపించారు.
2.26 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, పవర్‌ఫుల్ యాక్షన్స్ తో నిండిన ఈ సీజన్ లో సునీల్ గ్రోవర్ ఈసారి కీలక పాత్ర చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. రెండు పూర్తి భిన్న ప్రపంచాలు ఢీకొంటే ఎలా ఉంటుందో అలా ఈ వీడియో సడెన్ లో సోషల్ మీడియాలోకి వచ్చి క్లిక్ అయింది. ఈ వీడియో చూస్తుంటే రానా నాయుడు సీజన్2 మరింత డ్రామాతో రూపొందిందని అర్థమవుతుంది.
ఇందులో సునీల్ కనిపించగానే ఎవరూ ఊహించని సిట్యుయేషన్స్ చూస్తామనే ఫీలింగ్ కలుగుతుందని రానా ఈ సందర్భంగా వెల్లడించాడు. రానా నాయుడుగా తాను తన బెస్ట్ ఇచ్చానని, ఈ సీజన్ తో ఓ వైల్డ్ ఎక్స్‌పీరియెన్స్ ను ఆడియన్స్ కు అందించడానికి నెట్‌ఫ్లిక్స్ తో పాటూ తాము కూడా రెడీ అయ్యామని, ఈసారి రానా నాయుడు2తో ఊహించని కల్లోలాన్ని చూడబోతున్నారని ధీమా వ్యక్తం చేశాడు రానా. రానా నాయుడు సీజన్2 అందరికీ కచ్చితంగా ఇంట్రెస్ట్ ను కలిగిస్తుందని కూడా రానా చెప్పాడు.
లోకోమోటివ్ బ్యానర్ పై సుందర్ అరోన్ దీన్ని నిర్మించగా, ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. ఈ సీజన్ లో వెంకటేష్, రానా తో పాటూ అర్జున్ రాంపాల్, కృతి ఖర్బంద, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా లాంటి స్టార్ క్యాస్ట్ నటించింది. జూన్ 13 నుంచి రానా నాయుడు సీజన్2 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
