రానా నాయుడు సీజన్2 ట్రైలర్.. మేకర్స్ జాగ్రత్త పడ్డట్టే ఉన్నారు
దగ్గుబాటి వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jun 2025 1:06 PM ISTదగ్గుబాటి వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువైందనే కామెంట్స్ వినిపించినా ఆడియన్స్ మాత్రం ఈ సిరీస్ ను విపరీతంగా ఆదరించారు. దీంతో రానా నాయుడు సిరీస్ కు సీక్వెల్ గా రానా నాయుడు సీజన్2 ను తెరకెక్కించి దాన్ని రిలీజ్ కు రెడీ చేశారు.
రానా నాయుడు సీజన్2 మొదటి సీజన్ ను మరిపిస్తుందని, ఈసారి యాక్షన్, డ్రామా ఎక్కువగా ఉండనుందని ఇప్పటికే వెంకటేష్ వెల్లడించాడు. రానా నాయుడు సీజన్2 జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సీజన్ అందుబాటులోకి రానుండగా రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ రానా నాయుడు సీజన్2 ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
మొదటి పార్ట్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో రానా నాయుడు2 లో దాన్ని కాస్త తగ్గించినట్టు అనిపిస్తుంది. అంతేకాదు, తొలి సీజన్ కు మించిన వినోదం, థ్రిల్ కూడా ఈ సీజన్ లో ఉండనున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నాగ నాయుడిగా వెంకటేష్ తన కుటుంబం కోసం ఎంత వరకైనా వెళ్లే వాడిగా అద్భుతమైన నటనను కనబరిచాడు.
కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా సంయుక్తంగా దర్శకత్వం వహించిన రానా నాయుడు సీజన్2 ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించాయి. అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బంద, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినోమోరియా ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కు కొడుకుగా రానా కనిపించనున్నాడు. ట్రైలర్ చూస్తుంటే మొదటి సీజన్ లో చేసిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి టీమ్ కాస్త జాగ్రత్త పడినట్టు అనిపిస్తుంది.
