Begin typing your search above and press return to search.

'రాణా నాయుడు' ఈసారి ఫుల్ యాక్ష‌న్ మోడ్!

ఇంత‌కుముందు విక్ట‌రీ వెంక‌టేష్ డెబ్యూ ఓటీటీ షో `రాణా నాయుడు` విస్త్ర‌తంగా చ‌ర్చ‌ల్లోకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 May 2025 11:07 PM IST
రాణా నాయుడు ఈసారి ఫుల్ యాక్ష‌న్ మోడ్!
X

ఇంత‌కుముందు విక్ట‌రీ వెంక‌టేష్ డెబ్యూ ఓటీటీ షో `రాణా నాయుడు` విస్త్ర‌తంగా చ‌ర్చ‌ల్లోకొచ్చిన సంగ‌తి తెలిసిందే. వెంకీని పూర్తిగా ఊహించ‌ని రూపంలో వీక్షించ‌డంతో అభిమానులు షాక్ కి గ‌ర‌య్యారు. ఇందులో వెంక‌టేష్- రానా అండ‌ర్ వ‌ర‌ల్డ్ క‌నెక్ష‌న్ తో క‌నిపించారు. అయితే ఈ సిరీస్ లో హ‌ద్దులు చెరిపేసిన ఘాటైన ప‌దజాలం, డైలాగుల‌కు విమ‌ర్శ‌లొచ్చాయి. వెంకీని ఇంత బోల్డ్ షోలో చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. అయితే విమర్శలు ఎన్ని ఉన్నా రాణా నాయుడు నెట్‌ఫ్లిక్స్‌లో అద్భుత వ్యూస్ సాధించింది.

ఇటీవల మేకర్స్ సీజన్ 2 టీజర్‌ను ఆవిష్కరించారు. టీజ‌ర్ ఆద్యంతం పూర్తి యాక్షన్ విజువ‌ల్స్ తో ర‌క్తి క‌ట్టించింది. జూన్ 13 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో రాణా నాయుడు 2 స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని తాజాగా చిత్ర‌బృందం ప్రకటించింది. తారాగణంతో కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. రానా క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకుని క‌నిపించ‌గా, వెంకీ అగ్రెస్సివ్ గా చూస్తూ సీరియ‌స్ గా క‌నిపిస్తున్నాడు. అర్జున్ రాంపాల్ గొడ్డ‌లితో క‌నిపించాడు. పోస్ట‌ర్ ఇంటెన్స్ గా క‌నిపిస్తోంది. మొదటి భాగం పెద్ద హిట్ కావడంతో, రెండవ భాగం అద్భుతమైన స్పందనను పొందుతుందని భావిస్తున్నాన‌ని రానా ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు.

ఈ వెబ్ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. కరణ్ అన్షుమాన్ ఈ వెబ్ సిరీస్ సృష్టికర్త. సుపర్ణ్ వర్మ -అభయ్ చోప్రాతో కలిసి ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించాడు. మునుప‌టి త‌ప్పిదాల‌ను స‌రి చేసుకుని వెంకీని స‌రైన విధానంలో చూపిస్తే ఈసారి అంత‌గా విమ‌ర్శ‌లకు ఆస్కారం ఉండ‌ద‌ని భావిస్తున్నారు.