రానా నుంచి వస్తున్న కొత్తపల్లిలో ఒకప్పుడు..!
నటుడిగానే కాదు నిర్మాతగా కూడా రానా ఎప్పుడు తన అభిరుచిని తెలియచేస్తుంటాడు.
By: Tupaki Desk | 30 Jun 2025 8:12 PM ISTనటుడిగానే కాదు నిర్మాతగా కూడా రానా ఎప్పుడు తన అభిరుచిని తెలియచేస్తుంటాడు. దగ్గుబాటి రామానాయుడు గారి వారసత్వాన్ని ఆయన మనవడిగా నిర్మాతగా కొనసాగించాలన్న ఆలోచనతో రానా ఎప్పుడు తన దగ్గరకు వచ్చిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంకరేజ్ చేస్తుంటాడు. అలానే అతను నిర్మించిన సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. రానా టేకప్ చేశాడు అంటే అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుందని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఇక అలాంటి మరో ప్రయత్నంతోనే వస్తున్నాడు రానా. ఆయన నెక్స్ట్ చేస్తున్న సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు.
రూరల్ సెటైరికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను కేరాఫ్ కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య తరహాలోనే నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రవీనా పరుచూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రూరల్ ట్రెడిషన్స్ ఇంకా లోకాలిటీకి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తారని తెలుస్తుంది. ట్రెడిషనల్ వాల్యూస్ తో ఒక ఎమోషనల్ రైడ్ గా రాబోతుంది.
విలేజ్ యూతే ఇందులో లీడింగ్ క్యారెక్టర్స్ అని మేకర్స్ చెబుతున్నారు. ఒక ఇన్సిడెంట్ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి అన్నదే ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు కథ. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేస్తూ మేకర్స్ వదిలిన ప్రీ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేసింది. ఐతే సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో బయటకు వెళ్లడిస్తారు.
రానా నటించే సినిమాలే కాదు తను ప్రొడ్యూస్ చేసే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా అందరిలా కమర్షియల్ పంథాలో కాకుండా కాన్సెప్ట్ తో ఆడియన్స్ కి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అందిస్తాడు రానా. అందుకే రానా నిర్మాతగా సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉంటారు. మరి ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలో నటీనటులు ఎవరు.. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ ఏంటన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా ఆ తరహాలోనే ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు.
రానా నిర్మాతగానే కొనసాగాలి అనుకుంటే కమర్షియల్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ కొట్టగలడు కానీ రానా కొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కొత్త కథలతో వస్తున్నాడు. సో కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రానా టేస్ట్ ఏంటన్నది మరోసారి ప్రేక్షకులకు తెలియచేస్తుందేమో చూడాలి.
