మిరాయ్ లో మరో టాలెంటెడ్ యాక్టర్
ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మిరాయ్ లో ఓ క్రేజీ యాక్టర్ యాడ్ అవుతున్నట్టు సమాచారం.
By: Tupaki Desk | 2 April 2025 5:00 PM ISTగతేడాది సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజైన హను మాన్ మూవీతో ఎవరూ ఊహించని బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు తేజ సజ్జ. ఆ సినిమాతో తేజ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా అతనికి పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే హను మాన్ సినిమా యంగ్ హీరో తేజ సజ్జ స్థాయిని అమాంతం పెంచేసింది.
హను మాన్ తో వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవాలనే ఉద్దేశంతో తేజ తన తర్వాతి సినిమాల ఎంపిక విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం తేజ మిరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను చిన్న స్థాయిలోనే మొదలుపెట్టారు. కానీ హను మాన్ తర్వాత తేజ స్థాయి పెరగడంతో సినిమా స్థాయిని కూడా పెంచారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా సూపర్ హీరో సినిమాగానే తెరకెక్కుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. మిరాయ్ లో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండగా, ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మిరాయ్ లో ఓ క్రేజీ యాక్టర్ యాడ్ అవుతున్నట్టు సమాచారం.
అతను మరెవరో కాదు దగ్గుబాటి రానా. మిరాయ్ లో రానా ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నట్టు చిత్ర యూనిట్ ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పుడు రానా చేస్తున్న ఈ క్యారెక్టర్ ను ముందుగా దుల్కర్ సల్మాన్ తో చేయించాలని దర్శకనిర్మాతలు అనుకున్నారట. కానీ ఆయన బిజీగా ఉండి కాల్షీట్స్ ఖాళీగా లేకపోవడంతో ఇప్పుడు ఆ పాత్ర రానా దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా రితికా నాయర్ నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ముందు చిన్న బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా ఇప్పుడు తేజ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను భారీగా పెంచారని తెలుస్తోంది. ఈగల్ సినిమా తర్వాత కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతో ఎలాగైనా తన సత్తా చాటాలని చూస్తున్నాడు కార్తీక్.
