ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయిన రానా
ఆ అమ్మాయి డ్యాష్ ఇవ్వడంతో రానా చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో ఒక్కసారిగా రానాకు కోపమొచ్చింది.
By: Tupaki Desk | 4 Jun 2025 8:33 PM ISTసెలబ్రిటీల ఫోటోలకు వచ్చే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారు రెస్టారెంట్ లో కనిపించినా, జిమ్ దగ్గర కనిపించినా, కేఫ్, ఎయిర్‌పోర్టు ఇలా ఎక్కడికి వెళ్లినా వాళ్ల వెంట ఫోటోగ్రాఫర్లు వెంటపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తే మరికొందరు మాత్రం ఫోటోగ్రాఫర్లు తమ ఫోటోలు తీయడానికి ఇష్టపడరు.
రీసెంట్ గా రానా ముంబై వెళ్లగా అక్కడి ఎయిర్‌పోర్టులోని ఫోటోగ్రాఫర్లు రానా వెంట పడి ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. కానీ రానా తనకు ఇంట్రెస్ట్ లేదని, తన ఫోటోలు, వీడియోలు తీయొద్దని సున్నితంగా చెప్పాడు. అయినప్పటికీ ఫోటోగ్రాఫర్లు వినకుండా రానా వెంటపడుతూ ఫోటోలు తీశారు. దీంతో రానా హడావిడిగా వెళ్తుండటంతో ఎదురుగా వచ్చిన ఓ అమ్మాయి రానాకు డ్యాష్ ఇచ్చింది.
ఆ అమ్మాయి డ్యాష్ ఇవ్వడంతో రానా చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో ఒక్కసారిగా రానాకు కోపమొచ్చింది. వెనక్కి వెళ్లి మరీ ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అయ్యాడు. వద్దన్నప్పుడు వదిలేయొచ్చు కదా, నో చెప్పినా వెంటపడి మరీ ఫోటోలు తీయడం మంచి పద్ధతి కాదని ఫోటోగ్రాఫర్లకు చెప్పాడు. సదరు ఫోటోగ్రాఫర్ పై రానా ఫైర్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా ప్రస్తుతం రానా, తన అప్‌కమింగ్ వెబ్ సిరీస్ రానా నాయుడు2 ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ టూ ముంబై తిరుగుతూ ఉన్నాడు. అందులో భాగంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లిన రానాను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టి ఫోటోలని గొడవ చేశారు. మూడ్ బాలేక రానా మొదట ఇప్పుడొద్దని చెప్పాడు. అయినప్పటికీ వినకపోవడంతో రానా వారిపై సీరియస్ అవాల్సి వచ్చింది.
