రానా నిర్మాతగా సెటిలైపోతాడా?
నాలుగేళ్లగా నిర్మాతగా బిజీ అవ్వడంతో రానా నిర్మాతగానే సెటిలైపోతాడా? అన్న సందేహాలు తాజాగా తెర మీదకు వస్తున్నాయి.
By: Srikanth Kontham | 7 March 2026 4:00 AM ISTరానా వెండి తెరపై హీరోగా కనిపించి నాలుగేళ్లు అవుతుంది. `విరాట పర్వం` తర్వాత హీరోగా కనిపించలేదు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు..గెస్ట్ రోల్స్ తో తెరపై కనిపించడం మినహా హీరోగా మ్యాకప్ వేసుకోలేదు. కానీ నిర్మాతగా మాత్రం సత్తా చాటుతున్నాడు. ఈనాలుగేళ్ల కాలంలో నిర్మాతగా చాలా బిజీ అయ్యాడు. సొంత బ్యానర్ లోనిర్మించే సినిమాలతో పాటు ఇతర బ్యానర్ల భాగస్వామ్యంలోనూ మరికొన్ని చిత్రాలు నిర్మించాడు. హీరోగా తాను చేయలేని కథల్ని నిర్మాతగా వాటిని వెండి తెరకు ఎక్కించడంలో తన వంతు సహాయాన్ని మేకర్స్ కు అందించాడు.
`గార్గీ`, `పరేషాన్`, `కీడా కోలా`, `35`, `జిగ్రా`, ` కొత్త పల్లిలో ఒకడు`,` కాంత`, `ప్రేమంటే` ఇలా కొన్ని సినిమాలు నిర్మించి తన అభిరుచుని చాటుకున్నాడు. ఓ నటుడు మ్యాకప్ కు దూరంగా ఉండి సినిమాలు నిర్మించడం ఎంతో గొప్ప విషయం. సాధారణంగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు, అందులోనూ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటుడు ఫెయిల్యూర్స్ ఎదురయ్యే కొద్ద సక్సెస్ పై పోరాటాన్ని మరింత సీరియస్ గా కొనసాగిస్తాడు. కానీ రానా ఈ విషయంలో ఎంతో బ్యాలెన్స్ గా వ్యవహరించాడు. తన మార్కెట్ ఫరిది దాటి రిస్క్ తీసుకోకూడదని నటుడిగా దూరంగా ఉంటూ నిర్మాతగా బిజీ అయ్యాడు.
నాలుగేళ్లగా నిర్మాతగా బిజీ అవ్వడంతో రానా నిర్మాతగానే సెటిలైపోతాడా? అన్న సందేహాలు తాజాగా తెర మీదకు వస్తున్నాయి. రానా నిర్మాతగా బిజీ అవుతోన్న తీరుతోనే చాలా మందిలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాతయ్య మూవీ మొఘల్ రామానాయుడు చివరి శ్వాస వరకూ సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. దేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఏకైక భారతీయ నిర్మాతగానూ ఆయనకు పేరుంది. ఆయన వారసత్వాన్ని అందుకుని పెద్ద కుమారుడు సురేష్ బాబు చాలా సినిమాలు నిర్మించారు. ఈయన్ని కథతో ఒప్పించడం అంత సులభం కాదు. చాలా సెలక్టివ్ గా సినిమాలు నిర్మిస్తుంటారు.
రిస్క్ తీసుకోవడానికి ఆలోచించరు. కానీ ఆ రిస్క్ అన్నది గొప్పగా ఉండాలి. అప్పుడే రూపాయి నష్టం వచ్చినా పర్వాలేదనుకుంటారు. అనవసరమైన కథలపై ఖర్చు చేయరు. దర్శక, రచయితలు చెప్పే కథని ఎంతో విశ్లేషించే నిర్మాతగా ఒకే చేస్తారు. తాతాయ్య, తండ్రిలా అంత విశ్లేషణాత్మకంగా రానా మాత్రమే కనిపిస్తున్నాడు. రానా హీరో అయితే అభిరాంను నిర్మాతను చేయాలనుకున్నారు. రామానాయుడు సహా సురేష్ బాబు కూడా అదే అనుకున్నారు. కానీ అభిరాం `అహింస`తో హీరో అయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యాడు. నిర్మాతగా అంటే ఇంకా అంత అనుభవం సంపాదించలేదు. తాతయ్య, తండ్రి వారసత్వాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే సామర్ద్యం ఉన్నది మాత్రం రానాకే.
