నార్త్‌తో పోలిస్తే ఆ విషయంలో మనమే స్ట్రాంగ్ : రానా
'బాహుబలి' తరువాత ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే నార్త్ సినిమా, బాలీవుడ్ మాత్రమే. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి.
By: Tupaki Desk | 9 Jun 2025 12:06 PM IST'బాహుబలి' తరువాత ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే నార్త్ సినిమా, బాలీవుడ్ మాత్రమే. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ప్రపంచ సినిమా దృష్టి కూడా మారింది. మన నుంచి సినిమా వస్తోందంటే యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ఇదిలా ఉంటే సౌత్ సినిమా బిజినెస్, నార్త్ సినిమా బిజినెస్‌తో పాటు సగటు ప్రేక్షకుడు కోరుకునే వినోదంలోనూ తేడాలున్నాయని హీరో రానా స్పష్టం చేశారు. దీనిపై ఆసక్తికర వివరణ కూడా ఇవ్వడం విశేషం.
ఉత్తర భారతంలోని వ్యాపారంతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లోని థియేటర్ బిజినెస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వివిధ క్రాఫ్ట్‌లలో మన ఇండస్ట్రీ ఇతర పరిశ్రమల కంటే చాలా మెరుగ్గా వర్క్ చేస్తోందన్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సినిమాని సఘటు ప్రేక్షకుడు వీక్షించే ఖర్చు ఇప్పటికీ ముంబై,ఢిల్లీలతో పోలిస్తే అత్యంత చవకైనదని తెలిపారు.
ఇక పాన్ ఇండియా చిత్రాలు, గ్లోబల్ మూవీస్‌తో పాటు చిన్న బడ్జెట్ సినిమాల పరంగా తెలుగు సినిమా అద్భుతమైన అభివృద్దిని సాధించిందన్నారు. అయితే వరల్డ్ వైడ్‌గా మారుతున్న మార్పుల కారణంగా థియేటర్లు క్షీణిస్తున్నాయని, అయినా సరే మన పరిశ్రమ అభివృద్ధి పధాన నడుస్తోందని తెలిపారు. ఏడేళ్ల క్రితం థియేటర్లు రికార్డు స్థాయిలో ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. వివిధ కారణాల వల్ల చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి. దీనికి ప్రధాన కారణం యూట్యూబ్, పలు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు.
ఇక హైదరాబాద్, విశాఖపట్నం లాంటి పెద్ద పట్టణాలు, చిన్న సిటీలు కూడా థియేటర్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. మాస్ సినిమాల వల్ల సింగిల్ స్క్రీన్‌లు ఇప్పటికీ మన గలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యాపారం బలంగా నాటుకు పోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 2,500 వరకు స్క్రీన్‌లు యాక్టీవ్‌గా ఉన్నాయి. అయితే ఉత్తర భారతంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ సింగిల్ స్క్రీన్ వ్యవస్థ వేగంగా తగ్గుముఖం పడుతూ ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో మల్టీప్లెక్స్‌బిజినెస్ పెరుగుతోంది. దీనితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు అత్యథికంగా ఓటీటీలకు అడిక్ట్ అయిపోతున్నారు.
ఇది ఇప్పుడు ఉత్తరాది పరిశ్రమకు అత్యంత ప్రమాదకారిగా పరిణమిస్తోంది. ఎక్కడైనా కంటెంట్ ఉన్న సినిమాలదే హవా. దానికి ప్రత్యేక ఉదాహరణే ప్రియదర్శి నటించిన 'కోర్ట్'. ఇది చిన్న బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇందులో అతి తక్కువ మంది తెలిసిన ఆర్టిస్ట్‌లు మాత్రమే నటించారు. అయినప్పటికీ ప్రేక్షకులు కంటెంట్‌కు పట్టంకట్టి సినిమాకు విజయాన్ని అందించారన్నారు.
