Begin typing your search above and press return to search.

వీకెండ్ పార్టీ.. హాలీవుడ్ దిగ్గజాలతో రానా

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి.. అటు నటుడిగా.. ఇటు నిర్మాతగా మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 May 2025 4:00 AM
వీకెండ్ పార్టీ.. హాలీవుడ్ దిగ్గజాలతో రానా
X

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి.. అటు నటుడిగా.. ఇటు నిర్మాతగా మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వెకేషన్స్ కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా తన సతీమణి మిహీకా బజాజ్ తో కలిసి అమెరికా వెకేషన్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన పిక్స్ ను ఇప్పటికే మిహీకా షేర్ చేశారు.


అయితే తాజాగా మియామి గ్రాండ్ ప్రీక్స్ ఈవెంట్ కు రానా హాజరయ్యారు. ఆ సమయంలో హాలీవుడ్‌ సంగీత దిగ్గజాలైన 50 సెంట్, ఆస్కార్ విజేత గూడింగ్ జూనియర్‌ తో ముచ్చటించారు. లోకా లోకా సంస్థ సహ వ్యవస్థాపకులైన రానాతో పాటు అనిరుధ్ రవిచందర్, హర్ష వడ్లమూడి కూడా ఈవెంట్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న రానా.. బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్ లో సందడి చేశారు. అయితే అమెరికా మార్కెట్ లో తమ సంస్థ విస్తరణ కోసమే

ఆ ఈవెంట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్, నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు. పిక్స్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు. ఆల్ రౌండర్ రానా అన్న అంటూ కొనియాడుతున్నారు.

అయితే లీడర్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రానా. ఆ తర్వాత బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. అనంతరం అటు హీరోగా.. ఇటు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. అదే సమయంలో నిర్మాతగా చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ సినీ ప్రియులను మెప్పిస్తున్నారు. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు.

రీసెంట్ గా అరుదైన ఘనత కూడా సాధించిన విషయం తెలిసిందే. రెజిల్‌ మేనియాకు ఆహ్వానం అందుకుని, ఆ ఈవెంట్‌ లో సందడి చేసిన తొలి భారతీయ నటుడిగా రానా నిలిచారు. అది ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అంటూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. WWE (వరల్డ్‌ రెజిలింగ్‌ ఎంటర్టైన్మెంట్‌) మన బాల్యంలో ఓ భాగమని అన్నారు.

కానీ దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా ఉందని రానా చెప్పారు. WWE, తాను నటించిన రానా నాయుడు వెబ్‌ సిరీస్‌.. రెండూ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్నందుకు హ్యాపీ అని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు రానా. రానా నాయుడు సిరీస్ తో పాటు పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.