రెసిల్ మేనియాలో రానా.. ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా రికార్డ్!
ఇప్పుడు రెజిల్ మేనియా 41వ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ రానా హాజరయ్యారు.
By: Tupaki Desk | 21 April 2025 3:27 PM ISTWWE రెసిల్ మేనియా గురించి అందరికీ తెలిసిందే. రెజ్లింగ్ లో అదే పెద్ద ఈవెంట్ కాగా.. ఏడాదికి ఒకసారి జరుగుతోంది. ఇప్పుడు రెజిల్ మేనియా 41వ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ రానా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
అయితే రెజిల్ మేనియాలో పాల్గొన్న తొలి ఇండియన్ సినీ సెలబ్రిటీగా రానా దగ్గుబాటి ఘనత సాధించారు. లాస్ వెగాస్ లో జరిగిన రెజ్లింగ్ ఈవెంట్ లో రానా పాల్గొని.. WWE అభిమానులను ఉత్సాహపరచడమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. స్టైలిష్ వైట్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో రానా కనిపించారు.
ఈవెంట్ జరుగుతున్న సమయంలో హోస్ట్.. రానా గురించి మాట్లాడారు. రానా రెసిల్ మేనియాలో ఉన్నారు.. రానా నాయుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నారు అని హోస్ట్ తెలిపారు. అయితే రెసిల్ మేనియా 41వ ఈవెంట్ కు హాజరవ్వడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని రానా వెల్లడించారు. WWE మనందరి బాల్యంలో భాగమని అన్నారు.
ఇప్పుడు WWEని ప్రత్యక్షంగా చూడడం.. వరల్డ్ స్టేజ్ పై భారత్ కు ప్రాతినిధ్యం కల్పించండం.. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ లో WWE, రానా నాయుడు స్ట్రీమింగ్ అవ్వడం.. ఇది ఫుల్ ఫిల్ ఫీలింగ్ అని తెలిపారు రానా. అయితే టాలీవుడ్ హల్క్ కు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టమట. ఇప్పటికే ఆయన పలువురు రెజ్లర్లను కూడా మీట్ అయ్యారని వినికిడి.
ఇక రానా దగ్గుబాటి కెరీర్ విషయానికొస్తే.. ఆయన చివరిసారిగా హీరోగా విరాట పర్వం మూవీ చేశారు. ఆ తర్వాత లీడ్ రోల్ లో మరో సినిమాతో సందడి చేయలేదు. రీసెంట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ వేట్టయాన్ మూవీలో కనిపించారు. గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించారు.
అయితే 41వ రెజ్లింగ్ మేనియా ఏప్రిల్ 19-20 తేదీల్లో జరిగింది. ముందు నుంచి గెస్ చేసినట్లే ఫేమస్ రెజ్లర్ జాన్ సేనా అదరగొట్టారు. కోడీ రోడ్జా పై జాన్ సేనా విజయం సాధించి 17 టైటిళ్లతో అత్యధిక సార్లు WWE వరల్డ్ టైటిల్స్ గెలిచిన రెజ్లర్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. అలాంటి క్రేజీ ఈవెంట్ ను రానా ప్రత్యక్షంగా విట్నెస్ చేయడం విశేషమనే చెప్పాలి.
