మద్యం మత్తులో మాట్లాడట్లేదు రా.. ఫ్యాన్స్‌కు రానా ఫన్నీ రిప్లై!
దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాణంలో కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'కాంత'.
By: Tupaki Desk | 6 Nov 2025 10:23 PM ISTదుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాణంలో కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'కాంత'. పీరియాడిక్ సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. నవంబర్ 14న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
హైదరాబాద్‌లో జరిగిన 'కాంత' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా, అభిమానుల కోలాహలం మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతగా, నటుడిగా ఉన్న రానా దగ్గుబాటి మైక్ అందుకుని ప్రసంగం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
రానా మాట్లాడుతూ.. "నేను చిన్నప్పుడు మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ స్టూడియోలు లేవు, ఏమీ లేవు. రాళ్లు రప్పల మధ్యన వచ్చాం" అంటూ ఇండస్ట్రీ తొలినాళ్ల గురించి సీరియస్‌గా చెబుతున్నారు. ఆయన మాట్లాడుతున్న తీరు చూసి, ప్రేక్షకుల్లోంచి ఓ అభిమాని సరదాగా ఏదో కామెంట్ చేశాడు.
ఆ కామెంట్‌కు రానా వెంటనే రియాక్ట్ అయ్యారు. "ఏంట్రా? మద్యం మత్తులో మాట్లాడట్లేదు రా, మామూలుగా మాట్లాడుతున్నాను రా రేయ్!" అంటూ నవ్వుతూ ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. రానా స్పాంటేనియస్ రిప్లైకి థియేటర్‌లోని వారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. ఆయన మాటలకు దుల్కర్ సల్మాన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
ఆ తర్వాత రానా ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పుకుంటున్నాను. చెప్పుకోనివ్వరా నన్ను" అంటూ నవ్వేశారు. "నేను మీతో ఏదో మాట్లాడదామని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ మీరు అసలు మాట్లాడనివ్వట్లేదు" అంటూ ప్రేక్షకులతో తనకున్న చనువును, స్పోర్టివ్‌నెస్‌ను రానా మరోసారి బయటపెట్టారు.
ప్రస్తుతం రానా ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లైకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన 'కాంత' ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ పీరియాడిక్ డ్రామాలో దుల్కర్, రానా నటన ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
