రానా నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి..?
దగ్గుబాటి వారసుడు రానా ఎందుకో కెరీర్ లో వెనకపడ్డాడు. విరాటపర్వం తర్వాత రానా ఏదో రెండు సినిమాల్లో జస్ట్ క్యామియో రోల్ చేశాడు తప్ప 3 ఏళ్లుగా సోలో సినిమా చేయలేదు.
By: Tupaki Desk | 26 July 2025 10:00 PM ISTదగ్గుబాటి వారసుడు రానా ఎందుకో కెరీర్ లో వెనకపడ్డాడు. విరాటపర్వం తర్వాత రానా ఏదో రెండు సినిమాల్లో జస్ట్ క్యామియో రోల్ చేశాడు తప్ప 3 ఏళ్లుగా సోలో సినిమా చేయలేదు. రానా ఎందుకు ఇలా చేస్తున్నాడని దగ్గుబాటి ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రానా దుల్కర్ సల్మాన్ తో కలిసి కాంత సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పీరియాడికల్ స్టోరీగా వస్తుంది. ఆ మూవీతో పాటు సుధ కొంగర పరాశక్తి కూడా ఉంది. శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమాలో రానా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడట.
ఐతే రానాకి సోలో సినిమాలు దొరకట్లేదా ఎందుకు ఇలా వేరే హీరోల సినిమాల్లో చేస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. కెరీర్ మొదటి నుంచి ఇమేజ్ చట్రంలో ఇరుక్కు పోకుండా అన్ని పాత్రలు చేయగల యాక్టర్ గా పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు రానా. కెరీర్ ని కూడా అలానే ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో కమర్షియల్ సినిమాలు కూడా ట్రై చేశాడు కానీ అవి సరైన ఫలితం ఇవ్వలేదు. అందుకే మళ్లీ తన పాత పంథాలోనే వెళ్తున్నాడు రానా.
రానా సినిమాలో నటించాడంటే సంథింగ్ స్పెషల్ అని అనిపించుకోవాలని ఉంటుంది. అందుకే అతను రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లడు. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల్లో కూడా తానొక హీరో అన్నట్టుగా కాకుండా ఒక పాత్రగా చేస్తున్నాడు రానా. ఐతే ఫ్యాన్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ లను సీరియస్ గా తీసుకున్న రానా ఇక మీదట సోలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. రానా ఇప్పటికే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడట.
కాంత, పరాశక్తి పూర్తైన తర్వాత ఆ సినిమాలు మొదలవుతాయి. ఐతే రానా కొన్నాళ్లుగా హిరణ్య కశ్యప సినిమా చేయాలని చూస్తున్నాడు. కానీ అది ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. మరోపక్క లీడర్ 2 చేయాలని ఉన్నా శేఖర్ కమ్ముల కథ రెడీ చేయడం కష్టంగా ఉంది. ఈ క్రమంలో రానా సోలో సినిమాలు చేయాలంటే కాస్త టైం పట్టేలా ఉంది. ఐతే నెక్స్ట్ ఇయర్ మాత్రం రానా సోలో సినిమాల మీదే స్పెషల్ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడట. రానా కెరీర్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏదవుతుందా అన్నది చూడాలి. రానా మాత్రం తన ప్రయత్న లోపం లేకుండా తన బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు.
