రానా ఎందుకు సౌండ్ చేయడం లేదు!
టాలీవుడ్‌లో సహజంగా బ్లాక్ బస్టర్ హిట్టు కోట్టిన హీరోని పట్టుకోవడం కష్టం. రెమ్యునరేషన్ నుంచి చాలా డిమాండ్‌లు చేయడం మొదలు పెడతారు.
By: Tupaki Desk | 1 April 2025 8:00 PM ISTటాలీవుడ్‌లో సహజంగా బ్లాక్ బస్టర్ హిట్టు కోట్టిన హీరోని పట్టుకోవడం కష్టం. రెమ్యునరేషన్ నుంచి చాలా డిమాండ్‌లు చేయడం మొదలు పెడతారు. వారి డిమాండ్‌లని తట్టుకుని అన్నింటికి ఓకే అన్నవారే సదరు హీరోతో సినిమాలకు రెడీ అవుతుంటారు. కానీ దగ్గుబాటి రానా విషయంలో మాత్రం ఇది రివర్స్‌గా జరుగుతోంది. రానా `బాహుబలి` సిరీస్‌తో వరల్డ్ వైడ్‌గా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
బాహుబలికి ముందు రానాకున్న క్రేజ్ వేరు... ఆ తరువాత ఏర్పడిన క్రేజ్ వేరు. రానా ఏంటో, అతని టాలెంట్ ఏంటో ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచానికి చాటి చెప్పారు. హీరోగానే కాకుండా విలన్‌గానూ నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్‌లోనూ రానా రఫ్ఫాడించగలడని నిరూపించారు. ఈ సినిమా తరువాత రానా కెరీర్ ఓ రేంజ్‌లో ఉంటుందని, వరుసగా భారీ క్రేజీ సినిమాల్లో నటింస్తారని అంతా భావించారు. కానీ అది మాత్రం జరగడం లేదు. `లీడర్` సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రానా ఎందుకో అనుకున్న స్థాయిలో హీరోగా రాణించలేకపోతున్నారు.
సోలో హీరోగా నటించే ప్రయత్నాలు చేయడం లేదు. అరణ్య, విరాటపర్వం లాంటి సినిమాల్లో హీరోగా నటించినా అవి పెద్దగా ఆడకపోవడంతో రానా సోలో హీరోగా నటించడానికి ఆసక్తి చూపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఆ కారణంగానే రానా భీమ్లానాయక్, వెట్టయాన్ వంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటించాడని చెబుతున్నారు. రానా హీరోగా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నా కానీ రానా మాత్రం ఆ వైపు ఆలోచన చేయకపోవడం పలువురని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే రానా మాత్రం డబ్బింగ్‌లతో పాటు టాక్ షోలకు, చిన్న సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించడానికే ఆసక్తి చూపిస్తున్నాడు కానీ హీరోగా నటించడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రానీలో ఈ మార్పుకు కారణం ఏంటీ?.. ఒకప్పుడు తెలుగు సినిమా వర్లడ్ వైడ్‌గా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడిన రానా తన విషయంలో మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
