Begin typing your search above and press return to search.

హీరో రానా స్టోర్‌ ధరలు.. ఇండియాలోనే ఉన్నామా?

దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా సినిమాల్లో యాక్టివ్‌గా కనిపించడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం రెగ్యులర్‌గా కనిపిస్తూ వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   4 Jun 2025 12:00 AM IST
Rana’s Luxury High-End Grocery Store In Hyderabad
X

దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా సినిమాల్లో యాక్టివ్‌గా కనిపించడం లేదు. కానీ ఓటీటీలో మాత్రం రెగ్యులర్‌గా కనిపిస్తూ వస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఒక టాక్‌ షో తో సందడి చేసిన రానా త్వరలోనే రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రానా దగ్గుబాటి సినిమాలను మాత్రం ఎక్కువగా చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. హీరోగా కాకున్నా కనీసం భల్లాలదేవుడిగా అయినా అంటే విలన్ పాత్రల్లో అయినా నటించడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు చేయకున్నా, ఎక్కువగా కెమెరా ముందుకు రాకున్నా కూడా రానా ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు అని మరోసారి నిరూపితం అయ్యింది.

ప్రస్తుతం రానా నిర్వహిస్తున్న బ్రాడ్‌ వే షా గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్‌లో రానాకు చెందిన బ్రాడ్‌వే అనే మాల్‌ ఉంది. అందులో అన్ని రకాల కుటుంబ, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన సరుకులు ఉంటాయి. ఒక పెద్ద స్టైలిష్‌ కిరాణ షాపు అనుకోవచ్చు. సాధారణంగా పెద్ద పెద్ద షాప్స్‌లో ఉదాహరణకు డిమార్ట్‌ వంటి మాల్స్‌లో బయటి రేటుతో పోల్చితే కాస్త తక్కువగా ఉంటుంది. కానీ రానా షాప్‌లో మాత్రం బయట రేటుతో పోల్చితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం ఏంటి అని అడిగితే అందుకు ప్రత్యేకమైన సమాధానం వినిపిస్తూ ఉంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న క్లిప్స్‌ను చూస్తే రానా బ్రాడ్‌ వే స్టోర్‌లో చిల్లీ సాస్‌ ధర రూ.500, నుటెల్లా బిస్కట్‌ చిప్స్ ధర రూ.850, లియోనెల్‌ మెస్సీ మాస్‌ ఇంకా డ్రింక్ ధర రూ.1600లు. ఈ ధరలు చాలా ఎక్కువ అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈ రేట్లను బయటి రేట్లతో పోల్చుతూ రానా స్టోర్‌ పై తీవ్ర విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ స్టోర్‌కి వెళ్లి రేట్లను చూసిన వారు చాలా మంది మనం ఇండియాలోనే ఉన్నామా... ఇండియాలో ఈ వస్తువుకు లేదా ఈ పదార్థం కు ఇంత రేటు ఉందా అంటూ ఆశ్చర్యపోతున్న వారు చాలా మంది ఉన్నారు. కొందరు మాత్రం రేటు పోయినా క్వాలిటీ మాత్రం ది బెస్ట్‌ గా ఉంటుందని నమ్ముతున్నారు.

మొత్తానికి విమర్శలు లేదా మరో రకంగా రానా యొక్క స్టోర్‌ వార్తల్లో నిలుస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున పబ్లిసిటీ దక్కి కస్టమర్స్ పెరుగుతున్నారని తెలుస్తోంది. డబ్బులు పోయినా పర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడని వారు రానా స్టోర్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. అంటే సెలబ్రిటీలు మాత్రమే ఆ స్టోర్‌ను విజిట్‌ చేసే అవకాశాలు ఉంటాయి. రానా స్టోర్‌ బాగానే రన్‌ అవుతుంది... కానీ ఆయన సినిమా కెరీర్‌ మాత్రం సరిగ్గా రన్‌ కావడం లేదు అంటూ చాలా మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అయినా రానా సినిమాల్లో బిజీ కావాలని అంతా కోరుకుంటున్నారు. ఇలా చిన్న చిన్న స్టోర్స్‌తో కాకుండా సినిమాలతో రానా జనాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎప్పుడు సాధ్యం అవుతుందో చూడాలి.