టాలీవుడ్ లోని అలాంటి కల్చర్ లేదు
ముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తోన్న రానాను ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు ట్రై చేయగా, తన ఫోటోలు తీయొద్దని సున్నితంగా నో చెప్పినప్పటికీ వాళ్లు వినలేదు
By: Tupaki Desk | 6 Jun 2025 8:43 PM ISTముంబై ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తోన్న రానాను ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు ట్రై చేయగా, తన ఫోటోలు తీయొద్దని సున్నితంగా నో చెప్పినప్పటికీ వాళ్లు వినలేదు. ఫోటోలకు పోజులివ్వమని కోరుతూ ఆయన వెంట పడగా, వారిని తప్పించుకుని కారు ఎక్కే టైమ్ లో ఎదురుగా వస్తున్న మహిళ డ్యాష్ ఇవ్వడంతో రానా చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది.
దీంతో ఒక్కసారిగా రానా ఫైర్ అయ్యి వెనక్కి వెళ్లి ఫోటోగ్రాఫర్ తో మాట్లాడాడు. నో చెప్పినా ఇలా వెంటపడటం కరెక్ట్ కాదని వారికి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఈ విషయంపై తాజాగా రానా క్లారిటీ ఇచ్చాడు. తనకు ఇలాంటివి నచ్చవని, టాలీవుడ్ లో ఇలాంటి కల్చర్ లేదని రానా అన్నాడు. తనకు ఇలాంటి పబ్లిసిటీ నచ్చదని కూడా రానా చెప్పాడు.
తనకంటూ ఓ పర్సనల్ టైమ్ ఉంటుందని, ఆ టైమ్ లో ఇలాంటివి ఎంకరేజ్ చేయనని, ఫోటోలు తీయమని వాళ్లను పిలవనని, ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఇప్పటికే చెప్పినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదని, దాని వల్ల ఇబ్బందికరంగా అనిపిస్తుందని, రీసెంట్ గా ఎయిర్‌పోర్టులో చాలా మంది తన చుట్టూ చేరి ఫోటోలు తీయాలని చూశారని చెప్పాడు.
వారిని తప్పించుకునే క్రమంలో తన ఫోన్ కూడా కింద పడిందని చెప్పిన రానా మిమ్మల్ని పిలిపించుకున్న వారికి ఫోటోలు తీసి కంటెంట్ ను క్రియేట్ చేసుకోమన్నానని, ఫోటోలపై ఇంట్రెస్ట్ చూపించే వాళ్లకు ఫోటోలకు తీయండి తప్పులేదని చెప్పానని రానా క్లారిటీ ఇచ్చాడు. టాలీవుడ్ లోని సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతకు ఫోటోగ్రాఫర్లు ఎప్పుడూ భంగం కలిగించరని కూడా రానా ఈ సందర్భంగా చెప్పాడు.
