Begin typing your search above and press return to search.

మెగాస్టార్..సూప‌ర్ స్టార్ లాంటి స్టార్లు ఇక రారేమో!

తాజాగా ఆ ఇద్ద‌రి లెజెండ్స్ ని ఉద్దేశించి వెట‌ర‌న్ న‌టి ర‌మ్య‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 10:32 AM GMT
మెగాస్టార్..సూప‌ర్ స్టార్ లాంటి స్టార్లు ఇక రారేమో!
X

మెగాస్టార్ చిరంజీవి-సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ హీరోలిద్ద‌రి సినిమాలు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. కోట్లాది మంది అభిమానించే అగ్ర తార‌లు ఆ ఇద్ద‌రు. వాళ్ల కోసమే థియేట‌ర్ కి వ‌చ్చే అభిమానులెంతో మంది.టాలీవుడ్..కోలీవుడ్ లో ఎంత మంది స్టార్లు ఉన్నా! ఆ ఇద్ద‌రు స‌మ్ థింగ్ స్పెష‌ల్. ఇద్ద‌రి వ్య‌క్తిత్వాలు ఒకేలా ఉంటాయి. మృదు స్వభావంతో ఆక‌ట్టుకోవ‌డం లో ఇద్ద‌రి లో కామ‌న్ గా క‌నిపించే అంశం.

తాజాగా ఆ ఇద్ద‌రి లెజెండ్స్ ని ఉద్దేశించి వెట‌ర‌న్ న‌టి ర‌మ్య‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ర‌జ‌నీకాంత్..చిరంజీవి తెర‌పై క‌నిపిస్తే వృద్దుల నుంచి చిన్న పిల్ల‌ల వ‌ర‌కూ అంద‌రూ ఎంజాయ్ చేస్తారు.అలా ఉండ‌టం కేవ‌లం కొద్ది మందికే సాధ్యం. ఏదైనా పార్టీ జ‌రిగిన‌ప్పుడు కూడా కొంత మందిని ఆక‌ట్టుకోవ‌డ‌మే క‌ష్ట‌మైన ప‌ని. అలాంటి వాళ్లిద్ద‌రు కోట్లాది మందిని ఆక‌ట్టుకుంటారు. ఆక‌ర్షిస్తారు.

ఇలా చేయ‌డానికి ఎలాంటి లాజిక్ ఉండ‌దు. భ‌విష్య‌త్ లో ఇలాంటి స్టార్లు వ‌స్తారో? రారో తెలియ‌దు. ఒక‌వేళ వ‌చ్చినా వాళ్లు ఇంత సుదీర్ఘ కాలం స్టార్ డ‌మ్ కొన‌సాగిస్తారో? లేదో చెప్ప‌లేను' అని అన్నారు. అలాగే 'బాహుబ‌లి' సినిమా విష‌యంలో రాజ‌మౌళికి ర‌మ్య‌కృష్ణ కొన్ని కండీష‌న్లు పెట్టిన‌ట్లు తెలిపారు. 'బాహుబ‌లి' ఇంత పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకోలేదు. నేను అందులో న‌టించ‌డానికి కొన్ని కండీష‌న్లు పెట్టాను.

రాత్రిపూట షూటింగ్ చేయ‌ను. కొద్ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఇస్తాను. ఈలోగా నాపై షూట్ మొత్తం పూర్త‌వ్వాల‌ని రాజ‌మౌళికి ముందే చెప్పాను. ఇలాంటి వాట‌న్నింటికి రాజ‌మౌళి అంగీక‌రించారు. ఇది నిజంగా ఎంతో గొప్ప విష‌యం. ఆయన అంత పెద్ద డైర‌క్ట‌ర్ అయినా ఎంతో నిరాడంబ‌రంగా ఉంటారు. న‌టుల ప‌ట్ల ఎంతో గౌర‌వంగా ఉంటారు. ఆయ‌న‌లో నాకు బాగా న‌చ్చే క్వాలిటీ అది' అని అన్నారు.