Begin typing your search above and press return to search.

సముద్రం పక్కన హీటెక్కించే గ్లామర్ తో తెలుగమ్మాయి

సినిమాలకంటే కూడా సోషల్ మీడియాలో ఈమధ్య నటీనటులు మంచి గుర్తింపు అందుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   6 May 2025 3:39 PM
సముద్రం పక్కన హీటెక్కించే గ్లామర్ తో తెలుగమ్మాయి
X

సినిమాలకంటే కూడా సోషల్ మీడియాలో ఈమధ్య నటీనటులు మంచి గుర్తింపు అందుకుంటున్నారు. కొందరైతే సినిమాల్లోకి రాక ముందే ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇక ఆ రూట్లో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో రమ్య పసుపులేటి ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా అమ్మడు బాగానే పేరు తెచ్చుకుంది.

రమ్య ఇటీవల "మారుతి నగర్ సుబ్రమణ్యం" సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అయినా రమ్యకు అభిమానులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఆమె నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "విశ్వంభర" సినిమాలో చిన్న పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

రమ్య తన అందం, స్టైల్‌తో అభిమానులను ఎప్పుడూ ఆకర్షిస్తునే ఉంటుంది. ఆమె ఇటీవల థాయ్‌లాండ్‌లోని కో సముయ్ బీచ్‌లో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రమ్య ఈ ఫోటోల్లో ఎరుపు, తెలుపు చెక్స్ ఉన్న బ్రాలెట్‌లో కనిపిస్తుంది. అలాగే తెల్లని షర్ట్, తెల్లని ప్యాంట్ ధరించింది. ఈ లుక్‌లో ఆమె చాలా గ్లామరస్ గా, అందంగా ఉంది.

బీచ్‌లో సూర్యాస్తమయం సమయంలో ఆమె ఫోటోలు మరింత అందంగా ఉన్నాయి. అలాగే తెల్లని పువ్వుతో ఆమె స్మైల్ కూడా ఆకట్టుకునేలా ఉంది. రమ్య ఈ బీచ్ లుక్‌లో అల్ట్రా గ్లామరస్ బ్యూటీ అనిపించుకుంది. ఇక ఆమె స్టైల్, కాన్ఫిడెన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఆమె తీసిన మరికొన్ని ఫోటోలు చూస్తే, ఆమె ఎక్కడైనా తన అందంతో ఆకర్షిస్తుందని అర్థమవుతుంది. రమ్య ఈ ఫోటోలతో తన గ్లామర్‌ను మరోసారి చూపించింది. ఆమె అభిమానులు ఈ ఫోటోలను చూసి పాజిటివ్ గా స్పందిస్తున్నారు.