ఆ హీరోతో సీనియర్ హీరోయిన్ అన్ని రకాల పాత్రలు
ఓ సినిమాలో చెల్లిగా, ఓ సినిమాలో భార్యగా, మరో సినిమాలో అత్తగా ఇలా పలు పాత్రల్లో కనిపిస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 14 Jun 2025 7:00 AM ISTసినీ ఇండస్ట్రీలోకి ఎంటరైన కొందరు ఎలాంటి పాత్రలు చేయడానికైనా వెనుకాడకుండా ముందుకు దూసుకెళ్తే మరికొందరు మాత్రం ఫలానా తరహా పాత్రలే చేయాలి, ఫలానా వారి సరసనే నటించాలని గిరి గీసుకుని అందులోనే నటిస్తూ కెరీర్ లో నెక్ట్స్ లెవెల్ కు వెళ్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తూ ఉంటాం.
ఓ సినిమాలో చెల్లిగా, ఓ సినిమాలో భార్యగా, మరో సినిమాలో అత్తగా ఇలా పలు పాత్రల్లో కనిపిస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఒకప్పుడు పలువురు సరసన నటించి మెప్పించిన రమ్యకృష్ణ ఓ నటుడికి చెల్లిగా, కూతురిగా, భార్యగా కనిపించి, ఆయా పాత్రల్లో మెప్పించింది. ఆ నటుడు మరెవరో కాదు నాజర్. రజినీకాంత్- సౌందర్య జంటగా నటించిన నరసింహా సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరిగా నటిస్తే, ఆమెకు అన్నయ్య పాత్రలో నరసింహా సినిమాలో నాజర్ నటించారు.
ఆ తర్వాత తమిళంలో వంత రాజవతాన్ వరుమేను మూవీలో రమ్యకృష్ణ నాజర్ కు కూతురిగా కనిపించింది. ఈ సినిమా తెలుగు సూపర్ హిట్ అత్తారింటికి దారేదికి రీమేక్ గా తెరకెక్కింది. అత్తారింటికి దారేదిలో నదియా పాత్రను రీమేక్ లో రమ్యకృష్ణ చేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో నాజర్ కు భార్యగా రమ్యకృష్ణ నటించింది.
అలా నాజర్ తో కలిసి రమ్యకృష్ణ పలు పాత్రల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రజినీకాంత్ సినిమాలో విలన్ పాత్రలో నటించి అందరితో శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్లో ముందుకెళ్తుంది.
