Begin typing your search above and press return to search.

నీలాంబరి, శివగామి లను మించి కమలా రెడ్డి పాత్ర ఉండబోతుందా...

ఇక ఏది ఏమైనా కూడా రమ్యకృష్ణ కెరియర్ లోనే ఉత్తమమైన పాత్రల్లో కమలా రెడ్డి పాత్ర కూడా నిలిచిపోతుంది అంటూ సినిమా యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   15 Sept 2026 6:54 PM IST
నీలాంబరి, శివగామి లను మించి కమలా రెడ్డి పాత్ర ఉండబోతుందా...
X

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల పేర్లు చెబితే చాలు వాళ్లు చేసిన పాత్రలు మాత్రమే గుర్తుకొస్తుంటాయి. కారణం ఏంటంటే ఆ పాత్రల్లో వాళ్ళు నటించడం కాదు జీవిస్తుంటారు. దర్శకులు ఆయా పాత్రాలను వాళ్ళకోసమే డిజైన్ చేశారా అనే రేంజ్ లో ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటిస్తుంటారు. ఒకప్పుడు అందాల భామ గా గుర్తింపు తెచ్చుకొని చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలందరితో ఆడిపాడిన నటి రమ్యకృష్ణ... తను ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికి నరసింహ సినిమాలో చేసిన 'నీలాంబరి' క్యారెక్టర్ కి వచ్చిన గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తనలోని విలనిజాన్ని పూర్తిస్థాయిలో బయటికి తీసి ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేసింది.. రజినీకాంత్ లాంటి నటుడికి సైతం సవాల్ విసురుతూ తన నటన ప్రతిభను చూపించింది.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలో 'శివగామి' పాత్రలో తన రాజసాన్ని చూపిస్తూ రాజులేని 'మహిష్మతి' రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఒక గొప్ప రాణిగా పేరు సంపాదించుకుంది... ఇక ఇప్పుడు 'డేవిడ్ రెడ్డి' సినిమాలో 'కమలా రెడ్డి'పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఈరోజు రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా సినిమా యూనిట్ రమ్యకృష్ణ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు... బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన డేవిడ్ రెడ్డి అనే తిరుగుబాటుదారుడి కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కమలారెడ్డి గా కనిపిస్తున్న రమ్యకృష్ణ బ్రిటీష్ సైన్యాన్ని ఉచా కోత కోయబోతుందనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కమలారెడ్డి గా కత్తి పట్టుకొని తిరుగుబాటు చేస్తూ తనలోని తెగువ ను చూపించడానికి రమ్యకృష్ణ సిద్ధమైంది. కాబట్టి ఈ సినిమాలో కొత్త రమ్యకృష్ణ ను మనం చూడబోతున్నాం.

ఇక ఏది ఏమైనా కూడా రమ్యకృష్ణ కెరియర్ లోనే ఉత్తమమైన పాత్రల్లో కమలా రెడ్డి పాత్ర కూడా నిలిచిపోతుంది అంటూ సినిమా యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం డేవిడ్ రెడ్డి సినిమా నుంచి వచ్చిన టీజర్ కి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. దాని తర్వాత ఆ సినిమా నుంచి ఏ ఒక్క అప్డేట్ రాలేదు. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ పాత్రను పరిచయం చేయడంతో సినిమా మీద ఒక్కసారిగా హైప్ భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. నిజానికి రమ్యకృష్ణ లాంటి నటీమణి ఈ సినిమాలో ఉండటం ఈ మూవీ కి చాలా హెల్ప్ అవుతుందని రమ్యకృష్ణ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు... ఇక ఈ మూవీలో సముద్రఖని సైతం కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం...