Begin typing your search above and press return to search.

రామ్ లో ఎప్పుడు చూడని యాంగిల్..!

మరి స్కంద తో వస్తున్న రామ్ బోయపాటి కాంబో ఎలాంటి బీభత్సం సృష్టిస్తారు అన్నది చూడాలి.

By:  Tupaki Desk   |   26 Aug 2023 6:30 AM GMT
రామ్ లో ఎప్పుడు చూడని యాంగిల్..!
X

ఎనర్జిటిక్ స్టార్ గా తన సత్తా చాటుతూ వస్తున్న రామ్ యువ హీరోల్లో హిట్లు ఫ్లాపులు బ్యాలెన్స్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర తన ప్రతాపం చూపిస్తున్నాడు. ది వారియర్ షాక్ తర్వాత బోయపాటి శ్రీను తో స్కంద సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా రామ్ లుక్స్, క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. తన మొదటి సినిమా దేవదాసు నుంచి రామ్ లవర్ బోయ్ గానే కాదు మాస్ పాత్రల్లో కూడా నటించాడు. కానీ అక్కడ ఉంది బోయపాటి కాబట్టి స్కంద లెక్క వేరేలా ఉంటుంది.

తన సినిమా హీరోలని పవర్ హౌస్ లా చూపించడంలో బోయపాటి శ్రీను తర్వాతే ఎవరైనా అనిపిస్తారు. ఈ క్రమంలో స్కంద సినిమాలో రామ్ ని కూడా ఇదివరకు ఎప్పుడూ చూడని యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తున్నాడట. తప్పకుండా స్కంద తర్వాత రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఒక రెండు యాక్షన్ సీన్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయని సినిమాకు హైలెట్ గా చెప్పుకునే అంశాల్లో అవి ఒకటని అంటున్నారు.

రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కి మరోసారి సూపర్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు బోయపాటి. అఖండ తో బాలయ్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఆ హిట్ జోష్ తోనే స్కంద సినిమా తెరకెక్కించాడు. అఖండ తర్వాత వస్తున్న ఈ స్కంద కూడా రామ్ కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారట.

స్కంద ప్రచార చిత్రాలు కూడా సినిమా పై బజ్ పెంచేస్తున్నాయి. అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా తీసి బన్నీ ని మాస్ స్టార్ చేసిన బోయపాటి స్కంద తో రామ్ రేంజ్ కూడా మార్చబోతున్నాడని చెప్పుకుంటున్నారు. థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యేలా చూస్తున్నారు.

మరి స్కంద తో వస్తున్న రామ్ బోయపాటి కాంబో ఎలాంటి బీభత్సం సృష్టిస్తారు అన్నది చూడాలి. స్కందకి పోటీగా డీజే టిల్లు సీక్వెల్ మూవీ టిల్లు స్క్వేర్ వస్తుంది. కామెడీ వర్సెస్ మాస్ ఫైట్ లో ఏ సినిమా సక్సెస్ అందుకుంటుందా అని ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.