Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ రెమ్యునరేషన్.. అంత సీన్ ఉందా?

దర్శకుడు పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో ఏ స్థాయిలో డిజాస్టర్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   23 Aug 2023 9:33 AM GMT
డబుల్ ఇస్మార్ట్ రెమ్యునరేషన్.. అంత సీన్ ఉందా?
X

దర్శకుడు పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో ఏ స్థాయిలో డిజాస్టర్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈసారి ఎలాగైనా మళ్ళీ తనకు బౌన్స్ బ్యాక్ ఇచ్చిన రామ్ తోనే సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కథకు సీక్వెల్ గా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఇటీవల చాలా కూల్ గానే మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా ఫినిష్ అయింది.

ఇక మిగిలిన షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేయాలి అని పూరి జగన్నాథ్ అనుకుంటున్నారు. అయితే పూరి లైగర్ లాంటి దెబ్బ పడినప్పటికీ కూడా ఏమాత్రం తన తన స్టైల్ మార్చుకోకుండా అదే తరహాలో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇంకా కొన్ని పాత్రలను ఫైనల్ చేయవలసి ఉంది. అలాగే పూరి గ్యాప్ లేకుండా చకచకా సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా కోసం హీరో రామ్ పోతినేని గతంలో ఎప్పుడు లేనంత పారితోషికన్ని తీసుకుంటున్నట్లుగా ఒక టాక్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతుంది. దాదాపు 30 కోట్ల వరకు రామ్.రెమ్యునరేషన్ ఇస్తున్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే నిజంగా అతనికి అంత ఇస్తున్నారా, అసలు అంత సీన్ ఉందా? అని సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ కథనాలకు కౌంటర్లు అయితే పడుతున్నాయి.

పూరి కనెక్ట్స్ లో ఈ సినిమాను సొంతంగానే పూరి జగన్నాథ్ ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అసలే లైగర్ సినిమా దారుణంగా దెబ్బ కొట్టడంతో పూరి జగన్నాథ్ ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లోనే తీసుకురావాలి అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ రెమ్యునరేషన్ మాత్రం హీరోకు 30 కోట్లు ఇస్తున్నట్లుగా అయితే టాక్ వస్తోంది. ఇది నమ్మడానికి ఏమాత్రం వీలు పడడం లేదు.

ఎందుకంటే మరోవైపు రామ్ మార్కెట్ కూడా గత కొంతకాలంగా అసలు ఏమాత్రం పెరగలేదు. అతను ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత చేసిన రెడ్ సినిమా అంతగా ఆడలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ద్విభాషా చిత్రం ది వారియర్ అయితే దారుణంగా డిజాస్టర్ అయింది.ఆ సినిమా దాదాపు 15 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. కాబట్టి 30 కోట్ల రెమ్యునరేషన్ అనేది నిజం కాకపోవచ్చు.