Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ లో ఇరుక్కున్న రామ్.. స్పీడ్ పెంచాల్సిందే..!

రామ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తాడన్నది క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రామ్ సినిమా అనే ఊహాగానాలు వచ్చినా వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 3:00 AM GMT
డబుల్ ఇస్మార్ట్ లో ఇరుక్కున్న రామ్.. స్పీడ్ పెంచాల్సిందే..!
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 8న రిలీజ్ అనుకోగా అది కాస్త జూన్ కి వాయిదా వేశారని తెలుస్తుంది. అఫీషియల్ డేట్ చెప్పలేదు కానీ దాదాపు జూన్ సెకండ్ వీక్ లో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కన్ఫర్మ్ అంటున్నారు. అయితే యువ హీరోలంతా కూడా ఒక సినిమా ముగుస్తుంది అనుకునే టైం లో మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. కానీ రామ్ ఆ విషయంలో కాస్త వెనకబడ్డాడు.

డబుల్ ఇస్మార్ట్ సినిమా పూర్తి కావొస్తున్నా సరే నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలు రామ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడన్న ఊహాగానాలు కూడా లేవు. డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి హిట్ టార్గెట్ పెట్టుకున్న రామ్ పూరీతో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ ని రిపీట్ చేయాలని అనుకుంటున్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో సంజయ్ దత్ కూడా నటించడం వల్ల ప్రాజెక్ట్ పై భారీ హైప్ ఏర్పడింది.

రామ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తాడన్నది క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రామ్ సినిమా అనే ఊహాగానాలు వచ్చినా వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తుంది. ఇంతకీ రామ్ నెక్స్ట్ సినిమా విషయంలో తన ప్లాన్ ఏంటి..? ఎనర్జిటిక్ స్టార్ రామ్ తర్వాత సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి వస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

సినిమాల సెలక్షన్ విషయంలో రామ్ కూడా స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. మిగతా హీరోలంతా కూడా జెట్ స్పీడ్ లో సినిమా వెంట సినిమాలు చేస్తున్న తరుణంలో రామ్ కూడా వారిని అందుకునేలా సినిమాలను ప్లాన్ చేయాల్సి ఉంటుంది.

నిన్న మొన్న వచ్చిన హీరోలంతా కూడా తన మార్కెట్ పెంచుకునేలా భారీ ప్రాజెక్ట్ లు చేస్తుంటే రామ్ మాత్రం అలానే ఉండిపోయాడు. మరి రామ్ ఇక మీదట అయినా సరే సినిమాల విషయంలో జాగ్రత్త పడతాడేమో చూడాలి. రామ్ తో సినిమా అంటే యువ దర్శకులే కాదు స్టార్స్ కూడా రెడీ అనేస్తారు. మరి రామ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత ప్రాజెక్ట్ ఎవరితో చేస్తారన్నది చూడాలి.