Begin typing your search above and press return to search.

రామ్ డబుల్ ఆశలు.. ఆ ఇద్దరి చేతుల్లోనే

ఇక ఇప్పుడు డబుల్ శంకర్ తో మ్యూజిక్ తోనే మంచి అంచనాలను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా రామ్ కు కూడా సక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:30 PM GMT
రామ్ డబుల్ ఆశలు.. ఆ ఇద్దరి చేతుల్లోనే
X

రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ చూశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో మొదటిసారి రామ్ పూర్తి స్థాయిలో తెలంగాణ యాసతో మాట్లాడే ఎంతగానో అట్రాక్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ సినిమాకు మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది. మణిశర్మ అప్పటివరకు వరుస ప్లాప్స్ తో సతమతమవుతూ వచ్చాడు.

కానీ పూరీ కాంబినేషన్ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలాగే పూరి కూడా ఆ సినిమాతోనే సెట్ అయ్యి ఫామ్ లోకి వచ్చాడు అని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఆ తర్వాత లైగర్ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో డబుల్ ఇస్మార్ట్ సినిమా రాబోతోంది.

ఈ సినిమాను కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా నిర్మించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బాలీవుడ్ ను అట్రాక్ట్ చేసేందుకు సంజయ్ దత్ ను కూడా రంగంలోకి దింపాడు. అయితే ఈ సినిమా పై రామ్ ఆశలు గట్టిగానే పెట్టుకున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ అందుకొని మార్కెట్ను పెంచుకోవాలని చూస్తున్నాడు.

కానీ దర్శకుడు పూరి మణిశర్మ ఇద్దరు కూడా ఈ సినిమాకు పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇస్తేనే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంటుంది. ముందుగా అయితే మణిశర్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చాన్స్ మిస్ చేసుకోకూడదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మళ్లీ కాస్త బిజీ అయినా మణిశర్మ ఆ తర్వాత సినిమాలతో వరుసగా నిరాశ పరుస్తూ వచ్చాడు.

ఇక ఇప్పుడు డబుల్ శంకర్ తో మ్యూజిక్ తోనే మంచి అంచనాలను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా రామ్ కు కూడా సక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక పూరి కూడా లైగర్ గాయాన్ని మర్చిపోయా విధంగా మరో పవర్ఫుల్ సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఉంది. రామ్ పోతినేని తన రేంజ్ పెంచుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా డిజాస్టర్స్ ఎదురవుతున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత అతను తన రేంజ్ అంతకుమించి పెంచుకోవాలని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ కావాలి అంటే పూరి డైలాగ్స్ స్క్రీన్ ప్లే స్టోరీ చాలా కొత్తగానే ఉండాలి.

ఇక మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఇద్దరు నిజం చేస్తారో లేదో చూడాలి.