Begin typing your search above and press return to search.

రామ్ న్యూ లుక్.. ఎమున్నాడ్రా బాబు

స్కంద మూవీలో ఫుల్ గా హెయిర్ పెంచి, రఫ్ లుక్ లో ఉన్నట్లు ఇప్పటికే ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది. అయితే, ఇప్పుడు ఆయన డిఫరెంట్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు.

By:  Tupaki Desk   |   22 Sep 2023 12:45 PM GMT
రామ్ న్యూ లుక్.. ఎమున్నాడ్రా బాబు
X

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ మూవీ మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, రామ్ మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన డిఫరెంట్ లుక్ లో కనిపించారు.


స్కంద మూవీలో ఫుల్ గా హెయిర్ పెంచి, రఫ్ లుక్ లో ఉన్నట్లు ఇప్పటికే ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది. అయితే, ఇప్పుడు ఆయన డిఫరెంట్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించారు. మూవీలో లుక్ కీ, ఈ ఫోటోలకు చాలా తేడా ఉంది. సింపుల్ లుక్ అయినప్పటికీ, రామ్ ఫోటోలు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి ఆయన ఇలా వచ్చినట్లు తెలుస్తోంది.


ఇక, స్కంద మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ, ప్రభాస్ సలార్ మూవీ వాయిదా పడటంతో, ఈ మూవీ టీమ్ సినిమాని వాయిదా వేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మాస్, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రామ్ 20వ సినిమా కావడం విశేషం.

ఈ మూవీలో రామ్ సరసన శ్రీలీల, సయీ మంజ్రేకర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విడుదలకు ముందే మూవీలో పాటలు బాగా క్లిక్ అయ్యాయి. రీసెంట్ గానే, ఈ మూవీలోని ఐటెం సాంగ్ కూడా విడుదల చేశారు. ఈ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా రామ్ తో డ్యాన్స్ కోసం తలపడటం విశేషం.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ భారీ ఎత్తున నిర్మించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్కందలో శ్రీలీల, సయి మంజ్రేకర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. . ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.