Begin typing your search above and press return to search.

రామ్ పోతినేని హై వోల్టేజ్ లుక్.. కిర్రాక్

ఇక నెక్స్ట్ షెడ్యూల్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:19 PM GMT
రామ్ పోతినేని హై వోల్టేజ్ లుక్.. కిర్రాక్
X

యువ హీరో రామ్ పోతినేని నెక్స్ట్ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ద్వారానే ఇప్పటివరకు ప్రమోషన్స్ తో హడావిడిని మొదలుపెట్టేశారు.


అయితే సినిమాలో రామ్ రామ్ ఎలా కనిపించబోతున్నాడో మరోసారి ఒక ఫోటో ద్వారా క్లారిటీ వచ్చేసింది. పూరి జగన్నాథ్ సినిమాలో ఎలా ఉన్నా కూడా అందులో హీరో క్యారెక్టర్లు మాత్రం ఐ వోల్టేజ్ వైబ్రేషన్స్ తోనే ఉంటాయి. ఇక రామ్ సినిమా కెరీర్ లోనే ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక డిఫరెంట్ మూవీగా నిలిచింది. అతన్ని పూరి చూపించిన విధానం మాస్ ఆడియన్స్ కు ఎంతగానో నచ్చింది.

అయితే ఇప్పుడు సీక్వెల్ లో కూడా అంతకుమించి అనేలా చూపించబోతున్నట్లు అర్థమవుతుంది. రామ్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫోటోలో అతని బాడీ హైలెట్ అయ్యే విధంగా దర్శనమిచ్చాడు. సిక్స్ ప్యాక్ మాత్రమే కాకుండా కండలు తిరిగిన బుజాలతో అతను సెల్ఫీ దిగిన విధానం ఓ వర్గం ఫ్యాన్స్ కు ఎంతగానో కిక్ అయితే ఇచ్చింది. తప్పకుండా సినిమాలో ఈ క్యారెక్టర్ హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది అనేలా పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ నుంచి రామ్ సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ కూడా అదే తరహాలో ఉంటున్నాయి. ఇక చివరిగా అతను బోయపాటి దర్శకత్వంలో స్కంద అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అందులో హై ఎనర్జీతో కనిపించాడు. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ అంతకుమించి అనేలా ప్రజెంట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో డబుల్ ఇస్మార్ట్ ఇస్తున్నారు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తయింది. ఎక్కువగా ముంబైలోనే షూటింగ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.