Begin typing your search above and press return to search.

వ్యూహం.. ఇవేమీ తలనొప్పులు ఆర్జీవి?

నారా లోకేష్ సెన్సార్ సభ్యులకి నేరుగా వ్యూహం సినిమా ఆపాలని ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే ఏపీలో రాజకీయం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 9:48 AM GMT
వ్యూహం.. ఇవేమీ తలనొప్పులు ఆర్జీవి?
X

వైఎస్ జగన్ కి సపోర్ట్ గా రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వైఎస్ మరణాంతరం జగన్ ప్రయాణంతో ఈ కథని ఆర్జీవీ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కించారు. ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత్రలని నెగిటివ్ కోణంలో ఆర్జీవీ ఆవిష్కరించారు. దీంతో ఇప్పటికే టీడీపీ నుంచి వ్యూహం సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెన్సార్ కి లేఖ వెళ్ళింది.

నారా లోకేష్ సెన్సార్ సభ్యులకి నేరుగా వ్యూహం సినిమా ఆపాలని ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే ఏపీలో రాజకీయం నడుస్తోంది. వ్యూహం సినిమా కేవలం జగన్ కి సపోర్ట్ గానే తీసానని ఆర్జీవీ నేరుగానే ప్రకటించారు. ఇప్పటికే సినిమాని సెన్సార్ కి పంపించగా టీడీపీ నుంచి వచ్చిన అభ్యంతరాలని పరిగణంలోకి తీసుకొని వ్యూహం సెన్సార్ చేయకుండా రివైజ్ కమిటీకి పంపించారు.

ఆర్జీవీ దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఇప్పటికే చెప్పారు. ఇదిలా ఉంటే నిర్మాత నట్టికుమార్ కూడా అడ్డంకి వేశారు. రివైజ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న జీవిత రాజశేఖర్ ఉంటే వ్యూహం సినిమాకి పర్మిషన్ ఇస్తారని వెంటనే ఆమెని తప్పించాలని సెన్సార్ చైర్మన్ కి కంప్లైంట్ చేశారు. తాజాగా నట్టికుమార్ ఈ సినిమాపై తెలంగాణ హైకోర్టులో కూడా పిటీషన్ వేశారు.

సెన్సార్ రివైజ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న జీవిత రాజశేఖర్ గతంలో వైసీపీ పార్టీ సభ్యురాలిగా ఉన్నారని, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని, ఆమె ఉంటే మాత్రం వ్యూహం సినిమాకి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని నట్టికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యూహం సినిమాకి తమిళనాడు లేదా కర్ణాటకలో సెన్సార్ చేయాలని అప్పుడే న్యాయం జరుగుతుందనే వాదనని తెరపైకి తీసుకొచ్చారు.

దీనిపై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు కేసుని వారం రోజులు వాయిదా వేసింది. మరో వైపు ఎన్నికల కమిషన్ నుంచి కూడా వ్యూహం సినిమాని ఇంప్లీడ్ చేయడంతో సెన్సార్ కావడం మరింత కష్టమయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితిలో వ్యూహం మూవీ రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. అయితే ఆర్జీవీ మాత్రం ఎలా అయిన తన వ్యూహం మూవీ రిలీజ్ చేస్తానని చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి.