Begin typing your search above and press return to search.

క‌ల్కీలో వ‌ర్మ? ఇది పెద్ద సంచ‌ల‌న‌మే!

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'క‌ల్కీ 2898 ఏడీ' గ్లింప్స్ తో భారీ అంచ‌నాలు న‌మోద‌వుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Sep 2023 11:23 AM GMT
క‌ల్కీలో వ‌ర్మ? ఇది పెద్ద సంచ‌ల‌న‌మే!
X

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'క‌ల్కీ 2898 ఏడీ' గ్లింప్స్ తో భారీ అంచ‌నాలు న‌మోద‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమాలో భారీ తార‌గ‌ణం క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ కి జోడీగా దీపికా ప‌దుకొణే న‌టిస్తుండ‌గా..కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఏకంగా ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌నే పోషిస్తున్నారు. ఇంకా దుల్క‌ర్ స‌ల్మాన్ లాంటి స్టార్స్ సినిమాలో భాగ‌మ‌వుత‌న్నారు. అలాగే దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి కూడా గెస్ట్ రోల్ పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో వీట‌న్నింటికంటే సంల‌చ‌నాత్మ విష‌యం ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. క‌ల్కీలో సంచ‌నాల రాంగోపాల్ వ‌ర్మ కూడా భాగ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. నాగ్ అశ్విన్ వ‌ర్మ‌కి అతిధి పాత్ర బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు నెట్టింట షేర్ అవుతోంది. రాజ‌మౌళి..వ‌ర్మ‌పై షూటింగ్ పార్ట్ కూడా పూర్తిచేసార‌ని వినిపిస్తోంది. ప్ర‌స్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఇమేజ్ లు కుడా నెట్టింట చ‌క్కెర్లు కొడుతున్నాయి.

ఇదే నిజ‌మైతే అంచ‌నాలు పీక్స్ కి చేర‌తాయి. అయితే ఈ విష‌యాలు మేక‌ర్స్ ధృవీక‌రించాల్సి ఉంది. వ‌ర్మ సినిమాలో న‌టించ‌డం అన్న‌ది అంత ఈజీగా కుదిరే ప‌ని కాదు. ఆయ‌న సినిమాల్లో ఆయ‌నే న‌టించారు. అలాంటి వ‌ర్మ వేరే వారి ద‌ర్శ‌క‌త్వంలో మ్యాక‌ప్ వేసుకోవ‌డం అన్న‌ది సుల‌భం కాదు. ఒక‌వేళ అదే జ‌రిగితే మ‌రో లెవ‌ల్లో ఉంటుంది. వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం చేస్తారు..పాట‌లు రాస్తారు..వాటిని పాడ‌తారు. ఇది వ‌ర్మ ఫ్యాష‌న్.

మ‌రి ఈ ప్ర‌చారంలో వాస్త‌వాలు తెలియాల్సి ఉంది. చాలా వ‌ర‌కూ ఇది త‌ప్పుడు ప్ర‌చారం అవ్వ‌డానికి అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. మ‌రి దీనిపై రాంగోపాల్ వ‌ర్మ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. ప్ర‌స్తుతం రాంగోపాల్ వ‌ర్మ 'వ్యూహం' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నిక‌ల ముందు చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప‌ని చేస్తున్నారు.