Begin typing your search above and press return to search.

రామ్ పోతినేని అంటే పిచ్చి... అభిమాని ఏం చేశాడంటే..!

ఈ మూవీ పేరు స్కంద కావడంతో, రామ్ పోతినేని హార్డ్ కోర్ అభిమాని హరిహర అనే వ్యక్తి తన కుమారుడికి అదే పేరు పెట్టడం విశేషం.

By:  Tupaki Desk   |   16 Sep 2023 9:50 AM GMT
రామ్ పోతినేని అంటే పిచ్చి... అభిమాని ఏం చేశాడంటే..!
X

స్టార్ హీరోలకు అభిమానులు ఉంటారు అనే విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోపై అభిమానం చూపించడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కి వీరాభిమాని కూడా అభిమానం చూపించాడు. అతను చూపించిన అభిమానానికి హీరో రామ్ మాత్రమే కాదు, ఇతర అభిమానులు, నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.


ప్రస్తుతం రామ్ ఫోతినేని నటించిన స్కంద మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. నిజానికి ఈ మూవీ వినాయక చవితి సందర్భంగా ఈ పాటికి విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ మూవీ ఈ నెలాఖరుకు అంటే సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ పేరు స్కంద కావడంతో, రామ్ పోతినేని హార్డ్ కోర్ అభిమాని హరిహర అనే వ్యక్తి తన కుమారుడికి అదే పేరు పెట్టడం విశేషం. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను రామ్ పోతినేనిపై చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అయిపోతున్నారు.

అసలైన అభిమానం అంటే ఇది అని కొందరు, నిజమైన ప్రేమకు నిదర్శనం అని మరికొందరు నెట్టింట కామెంట్స్ చేస్తునన్నారు. ఈ విషయం రామ్ కి కూడా తెలియడంతో, ఆయన కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'ఈ వార్త నా మనసుకు హత్తుకుంది. స్కంద దేవుని ఆశీస్సులు ఆ బిడ్డకు ఎల్లప్పుడూ ఉండాలని తాను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలి' అంటూ రామ్ ట్వీట్ చేశారు.

రామ్ చేసిన ట్వీట్ కి నెటిజన్ల నుంచి విపరీతమైన రియాక్షన్ వచ్చింది. వారి అభిమానానికి, రామ్ స్పందించడం కూడా ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంది. ఇక స్కంద మూవీకి బోయాపాటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా, రామ్ చివరగా వారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ డిజాస్టర్ గా మారింది. దీంతో, రామ్ ఆశలన్నీ ఈ మూవీపైనే ఉన్నాయి. మరి ఈ మూవీతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.