Begin typing your search above and press return to search.

డిజాస్టర్ వచ్చినా ఛాన్సులు పట్టేస్తున్న ఖిలాడి డైరెక్టర్.. బిగ్ సర్‌ప్రైజ్!

రమేష్ వర్మ సినీ ప్రయాణం చూస్తే, 2009లో రైడ్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మినీ హిట్‌గా నిలిచింది.

By:  Tupaki Desk   |   9 March 2025 1:00 AM IST
డిజాస్టర్ వచ్చినా ఛాన్సులు పట్టేస్తున్న ఖిలాడి డైరెక్టర్.. బిగ్ సర్‌ప్రైజ్!
X

టాలీవుడ్‌లో ఫెయిల్యూర్స్ అనేవి ఒక్కసారి వచ్చినా, దర్శకులకు కొత్త అవకాశాలు రావడం చాలా కష్టం. అయితే కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ఎప్పటికప్పుడు తమ ప్రాజెక్ట్ సెలక్షన్‌తో సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటారు. అలాంటి దర్శకులలో రమేష్ వర్మ ఒకరు. ఈయన ఇప్పటివరకు పెద్ద సక్సెస్‌లు అందుకోకపోయినా, ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లతో ముందుకు సాగుతూ ఆశ్చర్యపరుస్తుంటాడు.

రమేష్ వర్మ సినీ ప్రయాణం చూస్తే, 2009లో రైడ్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మినీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత రవితేజతో చేసిన వీర సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు. కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతూ వచ్చిన రమేష్ వర్మ, అబ్బాయితో అమ్మాయి సినిమాతో డిజాస్టర్‌ను చవిచూడాల్సి వచ్చింది.

అయితే 2019లో రీమేక్‌గా వచ్చిన రాక్షసుడు మాత్రం డీసెంట్ హిట్‌గా నిలిచి, రమేష్ వర్మకు మళ్లీ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ హిట్ తర్వాత రవితేజతో మరోసారి జతకట్టి ఖిలాడి మూవీ తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. సినిమా బాగా ఆడలేదనే సంగతి పక్కన పెడితే, కథ, కథనం, టేకింగ్ విషయంలో చాలా నెగటివ్ టాక్ వచ్చింది.

దీంతో ఖిలాడి ఫెయిల్యూర్ తర్వాత రమేష్ వర్మకు మళ్లీ మేజర్ ఛాన్స్ రాదని సినీ వర్గాలు భావించాయి. కానీ అతను మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల హారర్ అండ్ యాక్షన్ హీరోగా సత్తా చాటిన రాఘవ లరెన్స్‌తో భారీ సూపర్‌హీరో మూవీ సెట్ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాలభైరవ అనేది సూపర్‌హీరో మూవీ అని టాక్. రమేష్ వర్మకు ఈ ఛాన్స్ రావడం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.

హారర్, యాక్షన్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాలో రమేష్ వర్మ టేకింగ్‌లో ఎలా ఉండబోతుందో చూడాలి. లరెన్స్ ఇప్పటికే కాంచన 4, బెంజ్ సినిమాలతో బిజీగా ఉండగా, కాలభైరవ కూడా అదే లైనప్‌లో భారీగా రాబోతున్నట్లు సమాచారం. ఓ వైపు వరుస ఫెయిల్యూర్స్.. మరోవైపు సడన్‌గా స్టార్ హీరోలతో సినిమాలు పట్టాలెక్కించడం.. ఇదంతా రమేష్ వర్మ మార్క్‌ అనే చెప్పాలి. మరి ఈ సినిమాతో అయినా క్రేజ్ ను పెంచుకునేలా హిట్ కొడతాడో లేదో చూడాలి.