లక్కంటే ఈ దర్శకుడిదే..
తెలుగు సినీ పరిశ్రమలో రమేష్ వర్మ ఒక ఆసక్తికర ప్రయాణాన్ని కొనసాగిస్తున్న దర్శకుడు. తొలిచిత్రంగా ‘రైడ్’తో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తరువాత వరుస ఫ్లాప్స్ చూశాడు.
By: Tupaki Desk | 22 April 2025 10:30 PMతెలుగు సినీ పరిశ్రమలో రమేష్ వర్మ ఒక ఆసక్తికర ప్రయాణాన్ని కొనసాగిస్తున్న దర్శకుడు. తొలిచిత్రంగా ‘రైడ్’తో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తరువాత వరుస ఫ్లాప్స్ చూశాడు. అప్పట్లో రవితేజతో చేసిన వీర కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక చాలా కాలం తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ వంటి థ్రిల్లర్ హిట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అది కూడా రీమేక్ సినిమా. అయితే రవితేజతో చేసిన ‘ఖిలాడీ’ ఫెయిల్యూర్ మరింత నష్టాలను చూపించింది.
ఇక ఆ తర్వాత ఆయన పేరు కాస్త వెనుకబడినట్టే కనిపించింది. ఇక ఛాన్సులు రావడం కష్టమే, అంతా అయిపోయిందని అనుకున్న టైమ్‌లోనే రమేష్ వర్మ మళ్లీ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో రెడీ అయ్యారు. అదీ మరోసారి మెయిన్ స్ట్రీమ్‌కు వస్తున్న ప్రయత్నమే కాకుండా, ఒక్కసారిగా పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం అతని కెరీర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చుతోంది.
ప్రస్తుతం లారెన్స్‌తో చేస్తున్న ‘కాలభైరవ’ సినిమాపైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇటీవలే క్లాప్ ఇచ్చారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇదో మాస్ యాక్షన్ డ్రామాగా తయారవుతున్న ఈ సినిమాలో హారర్, సూపర్ నేచురల్ అంశాలు మేళవించబోతున్నట్లు సమాచారం. ఇది పూర్తయ్యాక లారెన్స్‌తో మరో సినిమా కూడా ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అంటే ఓ స్టార్ హీరోతో రెండోసారి బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ అంటే రమేష్ వర్మ పట్ల ఉన్న నమ్మకం స్పష్టంగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన నిర్మాణ రంగంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. తన బ్యానర్‌లో ‘కొక్కొరకొ’ అనే టైటిల్‌తో ఓ ఆంథాలజీ మూవీని ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు ఓ హారర్ మూవీకి కూడా సిద్ధమవుతున్నారు. రెండు సినిమాలకూ కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్న రమేష్, తనదైన వ్యూహంతో ఎదుగుతున్నాడు.
నిర్మాతగా కూడా తన స్థాయిని నిరూపించేందుకు ఇదో ప్రయత్నం. ఇంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇటీవలే బాలీవుడ్ హిట్ మూవీ ‘కిల్’ రీమేక్ రైట్స్ కూడా రమేష్ వర్మ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ సిద్ధమైంది కానీ సరైన హీరో కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కోసం కూడా ఓ యాక్షన్ స్క్రిప్ట్ రెడీ చేశారట. బాలీవుడ్‌లో ఓ లవ్ స్టోరీ డైరెక్ట్ చేయాలన్న ఆలోచన కూడా అతని మైండ్‌లో ఉంది.
ఒక్క ‘కాలభైరవ’తో కాకుండా, నిర్మాణం, రీమేక్ రైట్స్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ అన్నింటిలోనూ రమేష్ వర్మ తనను తాను మరోసారి రీఇన్వెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితమే వెనక్కి వెళ్లిపోతాడు అనుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒక్కసారిగా ఐదు ప్రాజెక్ట్స్‌ను పట్టుకొని హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఫెయిల్యూర్ అయినా ఫోకస్ కోల్పోకుండా, తెలివిగా ఛాన్సులు పట్టేస్తున్నాడు. అలాగే అతనికి లక్కు కూడా బాగానే కలిసొస్తోందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూడాలి.