Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. హీరో రెండు పాత్రలు ఇవే

ఈ చిత్రంలో చరణ్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు

By:  Tupaki Desk   |   8 Aug 2023 5:17 AM GMT
గేమ్ ఛేంజర్.. హీరో రెండు పాత్రలు ఇవే
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్, సోషల్ మెసేజ్ గా కమర్షియల్ జోనర్ లో ఈ చిత్రాన్ని శంకర్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ ని శంకర్ తెరకెక్కిస్తున్నారంట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోంది.

రామ్ చరణ్ కి జోడీగా ఈ చిత్రంలో కియారా అద్వానీ నటిస్తోంది. ఇక చాలా మంది టాప్ క్యారెక్టర్ యాక్టర్స్ మూవీలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి లీక్స్ అప్పుడప్పుడు బయటకి వస్తున్నాయి. గేమ్ చేంజర్ లో సాంగ్స్ ని ఏకంగా 90 కోట్ల రూపాయిలతో తెరకెక్కిస్తున్నారంట. ఒక్కో సాంగ్ కి ఒక్కో కొరియోగ్రాఫర్ ని తీసుకున్నారు. అలాగే స్టంట్ మాస్టర్స్ కూడా చాలా పేరున్న వారిని ఉపయోగిస్తున్నారు

ఈ చిత్రంలో చరణ్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. అది కూడా రెండు టైమ్ లైన్స్ లో, తండ్రి కొడుకులుగా ఈ పాత్రలు ఉంటాయంట. తండ్రి పేరు అప్పన్న కాగా ఆ పాత్ర ఒక పొలిటీకల్ లీడర్ గా ఉండబోతోంది. సమాజంలో మార్పు కోసం పరితపించే నాయకుడి తరహాలో ఆ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కి సంబందించి కటౌట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే కొడుకు రామ్ నందన్ కుమార్ గా చెర్రీ మరో పాత్రలో కనిపిస్తున్నాడు. అకిరా నందన్ పేరుకు మ్యాచ్ అయ్యేలా రామ్ నందన్ ఉండడం వైరల్ అవుతోంది. ఇక ఆ పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య స్టోరీ అయితే సినిమాలో ఏమీ ఉండదని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో లీడర్ అప్పన్న క్యారెక్టర్ ఉంటుందంట. ఇప్పటికే ఈ మూవీ 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్ కూడా నవంబర్ నాటికి ఫినిష్ అయ్యే అవకాశం ఉందని టాక్.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో గేమ్ చేంజర్ మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి మైలేజ్ తీసుకొచ్చే విధంగా గేమ్ చేంజర్ ఉంటుందని భావిస్తున్నారు