Begin typing your search above and press return to search.

చరణ్ చెన్నై ప్రయాణం.. సూపర్ న్యూస్‌

కేవలం రెండు లేదా మూడు రోజుల షెడ్యూల్‌ కోసం రామ్‌ చరణ్ చెన్నై ప్రయాణం పెట్టుకున్నాడు అంటే ఎంత కీలకమైన సన్నివేశాలో అర్థం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   1 May 2024 9:34 AM GMT
చరణ్ చెన్నై ప్రయాణం.. సూపర్ న్యూస్‌
X

రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత చేస్తున్న గేమ్‌ చేంజర్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శంకర్‌ భారీ బడ్జెట్‌ తో దాదాపు ఏడాదిన్నర కాలంగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినట్లుగా యూనిట్ సభ్యులు అంటున్నారు.

గేమ్‌ చేంజర్ సినిమా కోసం రామ్‌ చరణ్‌ చెన్నై ప్రయాణం అయ్యాడు. అక్కడ అంజలితో పాటు ముఖ్య తారాగణం తో రామ్‌ చరణ్ రెండు లేదా మూడు రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొనబోతున్నట్లు యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ ను రెండు విభిన్నమైన పాత్రల్లో శంకర్ ఈ సినిమాలో చూపించబోతున్నాడు.

కేవలం రెండు లేదా మూడు రోజుల షెడ్యూల్‌ కోసం రామ్‌ చరణ్ చెన్నై ప్రయాణం పెట్టుకున్నాడు అంటే ఎంత కీలకమైన సన్నివేశాలో అర్థం చేసుకోవచ్చు. ఇంకా పాటల చిత్రీకరణతో పాటు కీలకమైన సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయని, జూన్ లేదా జులై వరకు సినిమా మొత్తాన్ని పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడట.

హీరోయిన్ గా కియారా అద్వానీ ఈ సినిమాలో కనిపించబోతుంది. ఫ్ల్యాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో చరణ్ కు జోడీగా అంజలిని చూడబోతున్నాం. శంకర్‌ సినిమా అంటే మంచి మెసేజ్ తో పాటు పుష్కలంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అన్ని విధాలుగా కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట.

శ్రీకాంత్‌, రవిబాబు, సునీల్‌ తో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్‌ లో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. దిల్‌ రాజుకు ఈ సినిమా నిర్మాతగా 50వ సినిమా అవ్వడంతో ఎక్కడ రాజీ పడకుండా భారీగా ఖర్చు చేస్తూ నిర్మిస్తున్నాడు.

ఈ ఏడాదిలోనే గేమ్‌ చేంజర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దిల్‌ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శంకర్‌ కూడా అందుకు తగ్గట్లుగానే జులై వరకు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు.