Begin typing your search above and press return to search.

అఫిషియల్‌ : చరణ్ ట్యాగ్ కూడా మార్చేశారుగా..!

తమ అభిమాన హీరోలను ఫ్యాన్స్ అనేక రకాల బిరుదు ఇచ్చి పిల్చుకోవడం మనం చూస్తూ ఉంటాం.

By:  Tupaki Desk   |   22 March 2024 9:31 AM GMT
అఫిషియల్‌ : చరణ్ ట్యాగ్ కూడా మార్చేశారుగా..!
X

తమ అభిమాన హీరోలను ఫ్యాన్స్ అనేక రకాల బిరుదు ఇచ్చి పిల్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్ లను గ్లోబల్‌ స్టార్స్ అంటూ ఫ్యాన్స్ పిలుచుకుంటున్న విషయం తెల్సిందే.

ఫ్యాన్స్ పిలుచుకునే వాటిలో కొన్నింటిని అధికారికంగా మార్చేస్తున్నారు. రామ్‌ చరణ్ ను మెగా ఫ్యాన్స్ తో పాటు గత కొన్నాళ్లుగా కొన్ని మీడియా సంస్థలు గ్లోబల్ స్టార్ అంటూ పిలుస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే ట్యాగ్‌ అఫిషియల్ అయ్యింది.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ హీరోగా ఆర్‌సీ16 సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమంకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వారు విడుదల చేయడం జరిగింది.

ఆ వీడియో లో రామ్‌ చరణ్ కు గ్లోబల్ స్టార్‌ అనే ట్యాగ్ ను తగిలించారు. ఇన్ని రోజులు ఫ్యాన్స్ మాత్రమే పిలుచుకుంటున్న గ్లోబల్‌ స్టార్‌ ఇప్పుడు అఫిషియల్‌ అయ్యింది. చరణ్‌ మరియు ఇతర యూనిట్‌ సభ్యులు ఒప్పుకున్న తర్వాతే ఈ వీడియో బయటకు వస్తుంది.

అంటే వారు గ్లోబల్‌ స్టార్‌ అనే పేరుకు ఓకే చెప్పి ఈ వీడియోను వదిలి ఉంటారు. కనుక ఇకపై ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టైటిల్ కార్డ్స్‌ లో కూడా రామ్‌ చరణ్ కు ట్యాగ్‌ గా గ్లోబల్ స్టార్‌ ఉండబోతుంది. ఇక ఎన్టీఆర్ కు దేవర సినిమా నుంచి మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ గా ట్యాగ్ ను మార్చేసిన విషయం తెల్సిందే.